గ్రీస్ లేదా గ్రీక్ ఐరోపా ఖండంలో ఉన్న ఓ చిన్నదేశం. రాజధాని నగరం ఏథెన్స్. కరెన్సీ యూరోలు. వీరి అధికారిక భాష గ్రీక్. చాలా మంది ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఐరోపాలోని ప్రాచీన భాషలలో గ్రీక్ ఒకటి. గ్రీకులలో ఎక్కువ భాగం గ్రీక్ ఆర్ధడెక్స్ చర్చి మతస్థులు. తరువాత ముస్లిం మైనారిటీలు ఉన్నారు. .
గ్రీస్ దాదాపు తమిళనాడు రాష్ట్రం అంత ఉంటుంది. ఈ దేశ భూభాగంలో దాదాపు 80 శాతం పర్వతాలే. సూర్యరశ్మి ఎక్కువ కాలం ఉంటుంది ఈ దేశంలో.
శాంతాక్లాజ్ గా పేరుపడిన శాంతానికోలస్ ఇక్కడివాడే. తెల్లటి గడ్డంతో ఉండే ఇతను పేదలకు, పిల్లలకు ఏదో విధంగా సహాయపడేవాడు.
గణితాన్ని కనుగొన్నది ఈ దేశస్థులే అంటారు. ఇక్కడ నివసించే ప్రజలు 98 శాతం మంది స్థానికులే. మిగతా రెండు శాతం మంది మాత్రమే బయటనుండి వచ్చి స్థిరపడినవారు. 18 సంవత్సరాలు నిండినవారు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఓటు వేయకపోవటం నేరం.
గ్రీస్ ఓ ద్వీపకల్ప సముదాయం. మొత్తం 2000 వేల ద్వీపాలు ఉన్నాయి. కానీ వీటిలో 170 ద్వీపాలలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు.గ్రీకు యువకులు కచ్చితంగా 18 నెలలపాటు సైన్యంలో పనిచేయవలసిందే. క్రీస్తుపూర్వం 776 సంవత్సరంలో మొదటి ఒలింపిక్స్ జరిగింది ఇక్కడే.
పర్యాటకం ద్వారా ఈ దేశానికి అధిక ఆదాయం చేకూరుతుంది. ఇక్కడి ప్రజలకంటే పర్యాటకులే ఎక్కువగా ఉంటారు. ప్రపంచం మొత్తంలో పూరావస్తు ప్రదర్శనశాలలు ఉన్నది గ్రీస్ దేశంలోనే. గ్రీసు దేశానికి 9000 మైళ్ల సముద్రతీర రేఖ ఉన్నది.
గోధుమలు, మొక్కజొన్న, బంగాళా దుంపలు, బార్లీ, బీట్ దుంపలు, పొగాగు వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, డైరీ ఉత్పత్తులు కలవు. లిగ్నేట్, పెట్రోల్, ఇనుప ఖనిజం, బాక్సైట్, లీడ్, జింక్, నికెల్, సాల్ట్ మొదలగునవి సహజ సంపదలు కలవు
కొద్ది సైన్యంతో ప్రపంచంలో అనేక దేశాలు జయించిన అలెగ్జాండర్ గ్రీస్ దేశంలోని మాసిడోనియా రాజ్యాని చెందిన వాడు.