మధ్య యూరోప్ లోని సోషలిస్ట్ దేశం హంగేరి. ఇది కమ్యూనిస్ట్ దేశం. హంగేరీ విస్తీర్ణం 93,031 చ.కి.మీ. రాజధాని బుడాపెస్ట్. వీరి అధికార భాష మాగ్యార్. దేశ కరెన్సీ ఫోరింట్. ప్రజలు మాగ్యార్, ఫిన్నిష్- ఉగ్రిక్ మరియు టర్కిష్ జాతులకు చెందినవారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. రోమన్ కేధలిక్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. హంగేరీ జానపద సంగీతం వీనుల విందుగా ఉంటుంది.
డాన్యూట్, తిస్జా నదులు ప్రధానమైన నదులు. మైదానాలు సారవంతమైనవి. బాలాటన్ సరస్సు ప్రాంతం సారవంతమైనది. ద్రాక్ష, మొక్కజొన్న, రైధాన్యం, ఓట్స్, పంచదార తయారుచేసే బీట్ దుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, బంగాళా దుంపలు, పొద్దు తిరుగుడు, గోధుమలు ప్రధానమైన వ్యవసాయ ఉత్పత్తులు.
గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమ, చేపల పరిశ్రమలున్నాయి.
బాక్సైట్, మాంగనీస్, యురేనియం, నేలబొగ్గు, ఇనుపరాయి, లిగ్నైట్, డోలమైట్, చమురు వాయివు పెట్రల్ ఖనిజ నిక్షేపాలున్నాయి, సిమెంట్, రసాయనిక ద్రవ్యాలు, ధాతు సామాగ్రి, యంత్ర సామాగ్రి తయారీ ప్రధాన పరిశ్రమలు.