ఐరోపాలోని ఈ దేశం ప్రశాంతమైన దేశం ఐస్ లాండ్. రాజధాని రెక్ జావిక్. వీరి అధికార భాష ఐస్ లాండిక్. కరెన్నీ ఐస్ లాండిక్ క్రోనా. విస్తీర్ణం 39 వేల 682 చ.మైళ్లు. ఎక్కువమంది క్రిస్టియన్లు కాని మత స్వాతంత్ర్యం ఉంది. వీరి జాతీయ క్రీడ హ్యాండ్ బాల్. 1 డిసెంబర్ 1918 సంవత్సరంలో డెన్మార్క్ నుండి ఈ దేశం స్వాతంత్ర్య పొందింది. ఈ దేశ ప్రజలలో ఎక్కువ మంది లూధరన్ చర్చ్ మతాన్ని అనుసరిస్తారు.
ఈ దేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేవు. ఐస్ లాండ్ లో నేరాల శాతం కూడా చాలా తక్కువ. అందు చేతనే ఇక్కడి పోలీసుల చేతుల్లో తుపాకులు కనబడవు. సమాజం స్నేహపూరితం. చేపలు, రొయ్యలు ఉత్పత్తుల ద్వారా వీరికి అధిక ఆదాయం సమకూరుతుంది.
ఇక్కడి ప్రజలలో 97.6 శాతం మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తారు. వీరు ఎక్కువగా సినిమాలు చూస్తారు. వందశాతం అక్షరాస్యత ఉన్న దేశం ఐస్ ల్యాండ్. ఈ దేశంలో రైళ్లు లేవు అంతా భూమార్గమే.
అందమైన జలపాతాలు, సముద్రాతీరాలు, అగ్నిపర్వతాలు ఐస్ ల్యాండ్ లో కనిపిస్తాయి. ఐస్ ల్యాండ్ పేరుకు తగ్గట్టుగానే వేసవిలో కూడా ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించదు. విచిత్రంగా వేసవికాలంలో కూడా 24 గంటలూ ఎండ ఉంటుంది
బంగాళా దుంపలు. కూరగాయలు పండిస్తారు. చేపల పరిశ్రమ, పాల ఉత్పత్తుల పరిశ్రమలున్నాయి.