header

Italy….ఇటలీ….

Italy….ఇటలీ….

ఇటలీ ఐరోపా ఖండంలోని ఒక పేరుపొందిన దేశం. మధ్యధరా సముద్రం మధ్యభాగంలో ఉన్నది. ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, ఆస్ట్రియా, స్లోవేనియా, సాన్ మారినో, వాటికన్ సిటీలు ఈ దేశ సరిహద్దులు. ఇటలీకి పశువుల నేల అనే అర్ధం వస్తుంది. ఇటలీ దేశ రాజధాని రోమ్. విస్తీర్ణం 3,01, 338 చదరపు కిలోమీటర్లు. వీరి భాష ఇటాలియన్. వీరి కరెన్సీ యూరో. ఇటలీలో 90 శాతం మంది ప్రజలు రోమన్ కేధలిక్స్.
ధర్మామీటర్, వయోలిన్, టెలిఫోన్ ఈ దేశస్థులు కనిపెట్టినవే. ఇటలీలో 3వేలకు పైగా మ్యూజియంలు ఉన్నాయి. ప్రపంచలోనే అత్యధికంగా ఈ దేశంలో ఎలివేటర్లు ఉన్నాయి.
ప్రపంచంలోనే పురాతన విశ్వవిద్యాలయంగా పేరుపొందిన రోమ్ విశ్వవిద్యాలయాన్ని 1303 సంవత్సరంలో ఏర్పాటు చేసారు. ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గాలలో ఇటలీలో ఉన్న ‘లాట్స్ చ్ బెర్గ్ బెసె టన్నెల్ ఒకటి. దీని నిర్మాణానికి 17 సంవత్సరాలు పట్టిందట.
పర్యాటకపరంగా ఈ దేశం ప్రసిద్ధి చెందినది. రోమ్, నప్లెస్, మిలాన్ నగరాలు ఇటలీలో అందమైన నగరాలుగా పేరుపొందినవి. పీసా, వెనిస్ నగరాలు కూడా అందమైనవే. లీవింగ్ టవర్ ఆఫ్ పీసా గొప్ప పర్యాటక ప్రాంతం. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశాలలో ఇటలీ అయిదో దేశం. దేశంలోని 5 భాగాలలో నాలుగవ వంతు పర్వతాలే. ఏటా సుమారుగా అయిదు కోట్లమంది ఈ దేశాన్ని సందర్శిస్తారు.
నియంత జూలియస్ సీసర్, క్రిస్టోఫర్ కొలంబస్, ప్రముఖ చిత్రకారుడు మైఖేల్ ఏంజిలో, ముస్సోలినీ, మార్కోపోలో ఈ దేశానికి చెందినవారే. మెర్కురీ, పోటాష్, జింక్, మార్బుల్ బెరైట్, సహజవాయువు, క్రూడ్ ఆయిల్ ఈ దేశంలో లభించే సహజ వనరులు.
పండ్లు, కూరగాయలు, ద్రాక్ష, బంగాళాదుంపలు, బీట్ దుంపలు, సోయా, చిరుధాన్యాలు వ్యవసాయ ఉతప్పత్తులు.