header

Lithuania….. లిధువేనియా...

Lithuania….. లిధువేనియా...

1990 సంవత్సరలో సోవియట్ రష్యా విచ్చిన్నం తరువాత లిధువేనియా స్వాతంత్ర్య రాజ్యంగా అవతరించింది. ఐరోపా ఖంఢంలోని బాల్టిక్ సముద్రానికి ఆగ్నేయ దిశలో ఉన్న తీరంలో ఉన్న మూడు దేశాలలో లిధువేనియా ఒకటి. 2004 సంవత్సరంలో యూరోపియన్ సమాఖ్యలో సభ్యదేశంగా చేరింది.
ఈ దేశం పూర్వచరిత్ర ప్రకారం బాల్టిక్ జాతి ప్రజలు మెదట్లో ఇక్కడ నివసించారు.
ఈ దేశ రాజధాని వెల్ నూయిస్. వీరి అధికార భాష లిధువేనియన్ తరువాత రష్యన్, పోలిష్ భాషలు చాలా కొద్దిమంది మాట్లాడుతారు. ఈ దేశ వైశాల్యం 65,200 చ.కి.మీ. వీరి కరెన్సీ లిటాస్. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. ప్రజలలో 79 శాతం మంది రోమన్ కేధలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు.
ధాన్యాలు, బీట్ దుంపలు, బంగాళాదుంపలు, కూరగాయలు పండిస్తారు. పశుమాంసం, పాలు, గుడ్లు, చేపలు ఇతర ఉత్పత్తులు.
వ్యవసాయ యోగ్యమైన భూములున్నాయి.