మాసిడోనియా దేశం ఆసియా నుండి యూరోప్ దేశాలకు ప్రయాణించే వర్తకులకు మరియు ఆక్రమణ దారులకు కేంద్రంగా ఉండేది. క్రీస్తు పూర్వం 356లో మాసిడన్ ఫిలిప్-2 మాసిడోనియన్ లో చాలా ప్రాంతాలను ఏకం చేసాడు. ఇతని కుమారుడు అలెగ్జాండర్ ది గ్రేట్ మాసిడోనియన్ ను మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు.
గ్రీకుల తరువాత ఈ దేశాన్ని రోమన్లు, అట్టోమన్లు 1912 సంవత్సరందాకా పాలించారు. రెండవ ప్రపంచయుద్దం తరువాత ఈ దేశం యుగోస్లోవియాలో భాగంగా ఉంది. 1991 సంవత్సరంలో యుగోస్లోవియా నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
మాసిడోనియా రాజధాని Skopje . ఈ దేశ వైశాల్యం 25,333 చ.కి.మీ. వీరి భాష మాసిడోనియన్, అల్బేనియన్ మరియు టర్కిష్, రోమా, సెర్బియన్. వీరి కరెన్సీ మాసిడోనియన్ దీనార్లు. ప్రజలలో ఎక్కవ మంది క్రిస్టియన్లు తరువాత 33 శాతం మంది ముస్లింలు కలరు.
ద్రాక్ష, ద్రాక్షా సారాయి, పొగాకు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పాలు, గ్రుడ్లు లభిస్తాయి.
రాగి, సీసం, జింక్, నాణ్యతలేని ఇనుప ఖనిజం, మాంగనీస్, నికెల్, లైమ్ స్టోన్, బంగారం, వెండి, జిప్సం, కలప, టంగ్ స్టన్ సహజ సంపదలు. వ్యయసాయ యోగ్యమైన భూమి కలదు.