మాల్టా ద్వీప దేశం మధ్యధరా సముద్రంలో ఐరోపా, ఉత్తర ఆఫ్రికా మధ్యలో ఉంది. ఇది కొన్ని ద్వీపాల సమూహం. ఇందులో ప్రధానమైన ద్వీపం మాల్టాతో పాటు గోజో, కోమినో అనే చిన్న ద్వీపాలు, నివాసయోగ్యం లేని అతిచిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. విస్తీర్ణం, జనాభా పరంగా ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఇదీ ఒకటి. ప్రాచీనులు దీన్నే ‘మెలిటా’గా పిలిచేవారు. అంటే తేనె ద్వీపమని అర్థం.
ఈ దేశ రాజధాని వాలెట్టా. ఇది ప్రముఖ చారిత్రక నగరం. ఈ దేశ జనాభా 4,45,426 (2018) దేశ విస్తీర్ణం 316 చ.కి.మీ. వీరి భాషలు ఆంగ్లం, మాల్టీస్. ఈ దేశ కరెన్సీ యూరో. ఈ దేశం శతాబ్దాల తరబడి పరాయి దేశాల పాలనలో ఉంది. 1964 సంవత్సరంలో మాల్టా స్వాతంత్ర్యం పొందింది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశంగా చేరింది. ఈ దేశ ప్రజలలో 98 శాతం మంది రోమన్ కేధలిక్స్(క్రిస్టియన్స్).
జెండాలో ఎరుపు, తెలుపు రంగులతో ఉండే ఈ దేశ పతాకం యూకే దేశ చిహ్నంతో ఉండటం వల్ల ప్రత్యేకమైందిగా భావిస్తారు.
ఇక్కడ 1980లో ‘పొపెయే’ అనే చిత్రం కోసం అందమైన ఇళ్లతో ఒక గ్రామాన్ని నిర్మించారు. ‘పొపెయే విలేజ్’గా పిలిచే ఈ గ్రామం మంచి పర్యాటక ప్రాంతం. వాలెట్టా దగ్గర్లో ఉండే ‘గ్రాండ్హార్బర్’ ప్రపంచంలోనే సహజంగా ఏర్పడిన లోతైన నౌకాశ్రయం. .
ఇక్కడుండే గ్యాన్టిజ, అయిదు వేల ఏళ్లనాటి హగర్కిమ్దేవాలయాలు ఈజిప్టు పిరమిడ్ల కన్నా పురాతనమైనవి. ఇక్కడ పడవలకు మెరిసే రంగులతో కళ్ల బొమ్మలు వేస్తారు. సముద్రపు చెడును, దురదృష్టాన్ని పోగొట్టడానికే ఈ ఆచారం. గోజో ద్వీప దేశంలో ‘అజూరే విండో’ అనే సున్నపురాయి తోరణం ప్రసిద్ధి చెందినది. ఇది ఎన్నో సినిమాల్లో కనిపిస్తుంటుంది. .
బంగాళ దుంపలు, కేలిఫ్లవర్, ద్రాక్ష, గోధుమలు, బార్లీ, టమాటోలు, సిట్రస్ జాతి పండ్లు పండిస్తారు. పందుల పెంపకం, కోళ్ల పెంపకం, పాడిపరిశ్రమలు కలవు. .
లైమ్ స్టోన్, సాల్ట్, వ్యవసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.