header

Romenia / రుమేనియా

Romenia / రుమేనియా

సోషలిస్ట్ రిపబ్లిక్ దేశం రుమేనియా. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండటంతో రుమేని అని పేరు వచ్చింది. ఈ దేశం నల్ల సముద్రాన్ని ఆనుకుని ఉంది. 1859లో ఏర్పాటైన ఈ దేశం 1940 సం.లో కమ్యూనిస్ట్ ల పాలనలోకి వచ్చింది. సోవియట్ ప్రాబల్య అప్పట్లో ఎక్కువగా ఉండేది.ప్రస్తుతం సోవియట్ జోక్యం లేదు.
ఈ దేశ విస్తీర్ణం 2,37,500 చ.కి. మీ. రాజధాని బుఖారెస్ట్. వీరి అధికార భాష రోమేనియన్. ప్రజలలో రోమన్ ల వారసులు 88 శశాతం మంది ఉన్నారు. రోమేనియన్ ఆర్తడక్స్ క్రైస్తవమతాన్ని పాటిస్తారు.
ట్రాన్స్ లేనియా పర్వతశ్రేణి పీఠభభూమి వలయాకారంలో విస్తరించి ఉంది.
డాన్యూబు నది పప్రధానమైనది. ఈ నది 1400 కి.మే ప్రవహించి నల్ల సముద్రంలుతుంది.
జ్యూనరి, ఓల్తుత్ , పూత్, ఆర్గేసుల, అయిలోమితా, సిరెతోల్ నదులు ప్రధానమైన నదులు.
పర్వతాలు ప్రకృతి సౌందర్యంతో అలరిస్తాయి. ఈ దేశంలో 2500 సరస్సులు, తటాకాలు ఉన్నాయి.
నేలకూడా సారవంతమైనది. చక్కటి పచ్చిక బయళ్లు ఉన్నాయి. అటవీ సంపద ఉంది.
పెట్రోల్, సహజవాయువు, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా లభిస్తాయి.
బాక్సైట్, నేలబొగ్గు, సీసం, రాగి, బంగారం, ఇనుపరాయి, వెండి, జింకు లోహాలు ఈ దేశంలో లభించే ఇతర ఖనిజాలు.
గోధుమ, మొక్కజొన్న, రైధాన్యం, పండ్లు, బంగాళాదుంపలు, పంచదార బీటు దుంపలు, సమిష్టి వ్యయసాయ క్షేత్రాలలో సాగుచేస్తారు.
యంత్ర సామాగ్రి, దుస్తుల తయారీ, ఆహార దినుసులు, డీజెల్ రైలు ఇంజన్లు, సహజ వాయువు, పెట్రోల్, పెట్రో రసాయనికాలు, ఎరువులు ముఖ్యమైన పరిశ్రమలు.