సాన్ మారినో చాలా ప్రాచీనమైన దేశం యూరోప్ లో క్రీ.శకం 321 సంవత్సరం నుండి ఈ దేశ చరిత్రకు ఆధారాలున్నాయి.. అసినైన్ పర్వత శ్రేణులలో ఉంది. చుట్టూరా ఇటలీ భూభాగమున్నది.
ఈ దేశ వైశాల్యం 61 చ.కి.మీ. రాజధాని సాన్ మారినో. వీరి అధికార భాష ఇటాలియన్. ప్రజలు క్రైస్తవ మతస్తులు. 95 శాతం మంది రోమన్ కేధలిక్స్.
గోధుమ, ద్రాక్షా, ఆలివ్ పంటలను పండిస్తారు. పింగాణీ, ఆహాపదార్ధాలు, సిమెంట్, తోలు, ఉన్ని ప్రధాన పరిశ్రమలు.
పర్వాటక దేశం కావటం వలన పర్యాటకుల ద్వారా విదేశీ ద్రవ్యం లభిస్తుంది.