header

Spain / స్పెయిన్

Spain / స్పెయిన్

పశ్చిమ యూరోప్ లో రష్యా, ఫ్రాన్స్ తరువాత పెద్ద దేశాలలో మూడవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. నీపోడీ ఎస్పానా స్పెయిన్ దేశపు అధికార నామం. రాజ్యాంగం ద్వారా రాజవంశీయులు పరిపాలిస్తున్న దేశం.
స్పెయిన్ దేశ విస్తీర్ణం 5,04,783 చ.కి.మీ. రాజధాని మాడ్రిడ్ బార్సిలోనా. వేలెన్షియా, సెవిల్లా, జారాగో జా ఇతర ముఖ్యమైన పట్టణాలు. వీరి అధికార భాష స్పానిష్.ప్రజలలో ఎక్కువమంది స్పానిష్ జాతులు, కాటాలిన్ గాలీషియన్ బాస్క్ తెగల వారు నివసిస్తున్నారు. వీరిలో 97 శాతం మంది రోమన్ కేధలిక్స్.
కొంతకాలం ఫ్రాంకో నియంత పరిపాలనలో ఉంది (1930-75). స్పానిష్ వారు సాహసవంతులైన నావికులుగా పేరుపొందారు. అమెరికా ప్రాంతంలో కాలు మోపిన మొదటి యూరోపియన్ కొలంబస్ స్పెయిన్ దేశస్తుడు. మటడార్ అనే గిత్త(ఎద్దు)లతో పోరాడే క్రీడకు స్పెయిన్ పేరు పొందింది.
ప్రధానమైన నది టాగస్ పశ్చిమంగా 900 కి.మీ పయనించి పోర్చుగల్ లో ప్రవేశిస్తుంది. మెసెతా పెద్ద పీఠభూమి. గ్వాడెల్ క్వివిర్ నది 640 కి.మీ. మేర ప్రవహించి అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది. 1950 సం.రానికి ముందు స్పెయిన్ దేశం ఆర్ధికంగా వెనుకబడి ఉంది. తరువాత పారిశ్రామిక ప్రగతి సాధించింది.
ఆలివ్, నారింజ, సారాయికి పనికి వచ్చే ద్రాక్షా, గోధుమ ప్రధానమైన పంటలు. బార్లీ, గజనిమ్మ, ఉల్లి పాయలు, మొక్కజొన్న, నారింజ, రైధాన్యం, బీటు దుంపలు, బంగాళా దుంపలు ఇతర పంటలు.
కాంటాబ్రియన్ పర్వతాలలో నాణ్యమైన ఇనుప ఖనిజం, నాసిరకం నేలబొగ్గు, రాగి, పాదరసం, పోటాష్, సీసం, జింకు, పైరిటీస్, టైటానియం, మాంగనీస్ లభిస్తాయి.
మోటారు కార్ల తయారీ, నౌకానిర్మాణాలకు స్పెయిన్ దేశం పేరుపొందింది.సహజ వాయివు, పెట్రోల్ ఉత్పత్తులు, సిమెంట్ర, రసాయినిక ద్రవ్యాలు, దుస్తులు, పానీయాలు, ఉక్కు, పాదరక్షలు, రవాణా వాహనాలు, విద్యుత్ యంత్రాలో ఇతర పరిశ్రమలు.
పర్యాటక పరమైన దేశం కావటం వలన ఆర్ధికంగా కూడా బలపడింది. తీరప్రాంతాలలో పర్యాటకులకు తగిన వసతులున్నాయి. రాజులకు సంబంధించిన కట్టడాలు, గిత్తల పోరాటాలు వీరి సాంస్కృతిక సంబరాలు విదేశీ యాత్రికులకు ప్రత్యేక ఆకర్షణలు. ధరలు అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉంటాయి