యూరోప్ లో ఉత్తర దిశలో ఉన్న ఒక సంపన్న దేశం స్వీడన్. సోవియట్ రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్ తరువాత నాలుగవ పెద్ద దేశం కూడా. క్రీ.శ. 1434 సం.నుండి రాజ్యాంగం ప్రకారం రాజవంశీయులు పాలిస్తున్న దేశం. స్వీడిష్ భాషలో ఈ దేశం పేరు కొనున్గారికెట్ స్వెరిగే. ఉత్తరాన ఆర్కిటిక్ వలయం విస్తరించి ఉన్నది. దక్షిణాన, తూర్పున బాల్టక్ సముద్రం, పశ్చిమాన నార్వేదేశం సరిహద్దులు కలిగి ఉంది.
స్వీడన్ విస్తీర్ణం 4,49,732 చ.కి.మీ. రాజధాని స్టాక్ హోం. అధికార భాష స్వీడిష్. ప్రజలు నార్డిక్ జాతికి చెందినవారు. క్రైస్తవ మతాన్ని పాటిస్తారు.
గోటెబర్గ్, మాల్మో, ఉప్పలా, ఓరెబో, నోర్కోసింగ్ ఇతర ప్రధాన పట్టణాలు
ప్రపంచంలోనే ఈ దేశం కలప, కలప గుజ్జు, కాగితం తయారీలో ఆగ్రస్థానం వహిస్తుంది. ఫిర్, పైన్, స్ర్పూస్ వృక్షజాతులు ఎక్కువ.
హిమనదులు, చెరువులు, సరస్సులు చాలా ఉన్నాయి కానీ అతి శీతల దేశం కావటంతో భూమి వ్యవసాయానికి పనికి రాదు. ఐనా దేశానికి కావలిసిన బార్లీ, ఓటు, రై ధాన్యం, బంగాళాదుంపలు, బీటు దుంపలు, గోధుమ సాగుచేస్తున్నారు. పాడిపరిశ్రమ, ఆవులు, పందుల పోషణ ఎక్కువగా ఉంది. కొనిఫెరస్ అడవుల సంపద పుష్కలంగా ఉంది. జలవిద్యుత్ కూడా ఎక్కువగా ఉంది.
రాగి, సీసం, బంగారం, జింకు, ఇనుపరాయి, యురేనియం ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. యంత్రపు పనిముట్లను తయారు చేయటానికి ఉపయోగపడే ఉక్కు తయారీ ఈ దేశం ప్రసిద్ధి చెందినది.
కాడ్ చేప, హెర్రింగ్, మెకెరెల్, సాల్మన్ చేపలు లభిస్తాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం స్వీడన్. విమానాలు, మోటారు కార్లు, వ్యవసాయపు పనిముట్లు, బాల్ బేరింగులు, విద్యుత్ యంత్రసామాగ్రి, ఎరువులు, గాజు, కాగితంలో రకాలు, నౌకా నిర్మాణం, ఉక్కు సామాగ్రి ఇంకా అనేక ఎగుమతులకు సంబంధించి పరిశ్రమలు స్వీడన్ లో ఉన్నాయి.
సుప్రసిద్ధ నోబుల్ బహుమానం రూపకర్త రాబర్ట్ నోబుల్ స్వీడన్ దేశానికి చెందినవాడే