header

Ukraine …ఉక్రేయిన్...

Turkey… టర్కీ……

Ukraine …ఉక్రేయిన్... ఆధునిక కాలంలో ఉక్రేయిన్ పోలెండ్ ఆ తరువాత రష్యాలో భాగంగా ఉండేది. రష్యావారి బారి నుండి ఉక్రేనియన్లు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చారు. రష్యా వారు వీరిని అనేక బాధలకు గురిచేసారు. జోసఫ్ స్టాలిన్ ఉక్రేయన్ల మీద ఆధిపత్యం నిలుపుకోవటం కోసం లక్షలాది మంది ఉక్రేనియన్లను చంపించాడు. తరువాత రెండవ ప్రపంచయుద్ధంలో జర్మన్ నాజీలు ఒక మిలియన్ ఉక్రేనియన్లను హతమార్చారు.
1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఉక్రనియన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ దేశ రాజధాని Kyiv . ఈ దేశ వైశాల్యం 6,03,700 చ.కి.మీ. వీరి భాష ఉక్రేనియా తరువాత రష్యన్ భాష . ఈ దేశ కరెన్సీ hryvnia
గింజ ధాన్యాలు, షుగర్ దుంపలు, పొద్దు తిరుగుడు దుంపలు, కూరగాయలు పండిస్తారు. పశుమాంసం, పాలు ఇతర ఉత్పత్తులు.
ఇనుప ఖనిజం, బొగ్గు, మాంగనీస్, సహజవాయువు, ఆయిల్, సల్ఫర్, గ్రాఫైట్, టైటానియం, మేగ్నీషియమ్, నికెల్, పాదరసం, కలప సహజసంపదలు. వ్యయసాయ యోగ్యమైన భూమి ఉంది.