ప్రపంచంలోనే అతి చిన్న దేశాలలో వాటికన్ సిటి ఒకటి. ఈ దేశ వైశాల్యం కేవలం 100 ఎకరాలు. రోమ్ (ఇటలీ)నగరం మధ్యలో ఉన్నది. ఇది ఒక మతపరమైన దేశం క్రైస్తవమతంలోని రోమన్ కేధలిక్ చర్చి తెగ వారికి ప్రధాన కేంద్రం. ఈ నగరం చుట్టూ గోడ కట్టబడి ఉన్నది. ఈ నగరం కేధలిక్స్ చర్చ్ వారికి చెందినది మరియు కేధలి చర్చ్ వారిచే పరిపాలించబడుచున్నది. ఈ దేశ కరెన్సీ యూరోలు. ఈ దేశ జనాభా కేవలం 1000 మంది మాత్రమే (2019 లెక్కలను అనుసరించి.) 1929 సంవత్సరంలో ఈ దేశం ఏర్పడింది.St. Peter;s Basilica కట్టడం మతపరమైన కట్టడాలలో ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడం.
ఇక్కడ రోమన్ కేధలిక్ సంప్రదాయాన్ని అనుసరించే క్రైస్తవుల మతగురువు బిషప్ (బిషప్ ఆఫ్ రోమ్) నివసిస్తారు. ఈదేశానికి టెలిఫోన్, తపాలాకార్యాలయం సొంత వ్యవస్ధలు కలవు. రేడియో వ్యవస్థ, బ్యాంక్ కూడా కలవు.
ఇక్కడ ఉన్న రోమన్ కేధలిక్ చర్చ్ ప్రపంచ ప్రసిద్ధి గాంచినది మరియు రోమన్ కేధలిక్స్ కు పుణ్యక్షేత్రం. వాటికన్ మ్యూజియం, సిస్టేన్ చాపెల్ భవనం ప్రసిద్ధి చెందినవి.