ఈ దేశం Antigua and Barbuda అనే రెండు మానవ నివాసాలు కలిగిన దేశం. ఇతర దీవులు ఉన్నాయి కానీ వాటిలో ఎవరూ నివసించరు. కరేబియన్ సముద్రంలో ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలకు మధ్యలో ఉన్నది. ఈ దేశంలో మొట్టమొదటిగా సిబోని అనే తెగల ప్రజలు నివసించారు. వీరిని స్టోన్ ప్రజలు అనికూడా అంటారు. తరువాత అమెరికాలోని వెనిజులాకు చెందిన అరావాక్స్ అనే తెగ వారు ఇక్కడికి వలస వచ్చారు.వీరు మొక్కజొన్న, పైనాపిల్, ప్రత్తి, పొగాకు పంటలను సాగుచేశారు.
ఈ దేశ రాజధాని సెయింట్ జాన్స్. ఈ దేశ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్స్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ఇంకా ప్రాంతీయ భాషలు మాట్లాడుతారు. ఈ దేశం నవంబర్ 1వ తేదీ, 1981 సంవత్సరంలో అమెరికా నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది.
ప్రత్తి, పొగాకు, కూరగాయలు, అరటి, కొబ్బరి, మామిడి, చెరకు వ్యవసాయ పంటలు.
ఆహ్లాదకరమైన ఈ దేశ వాతావరణం విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు.