ఉత్తర అమెరికాలో వెస్ట్ ఇండీస్ కు ఉత్తరంగా దీవులతో కూడిన స్వతంత్ర రాజ్యం బహమాస్. పూర్యం చుట్టుప్రక్కల దీవుల నుండి Lucayans అనే తెగ ప్రజలు వచ్చి బహమాస్ దీవులలో స్థిరపడ్డారు. 1492 సంవత్సరంలో క్రిస్టఫర్ కొలంబస్ బహమాస్ దీవులలో సాన్ సాల్వడార్ అనే దీవిలోకి వచ్చాడు. కానీ అతనితో పాటు స్మాల్ పాక్స్ అనే వ్యాధిని కూడా వ్యాపింపజేయటం వలన ఈ దీవులలోని సగం మంది ప్రజలు స్మాల్ పాక్స్ వలన మరణించారు. తరువాత స్పానిష్ బానిసవర్తకులు Lucayans తెగలవారిని తమ బంగారు గనులలో పనిచేయటానికి బానిసలుగా మార్చారు. తరువాత 25 సంవత్సరాలు ఈ తెగ ప్రజలు వలసపోవటం కానీ, చనిపోవటం కానీ జరగటం వలన ఈ తెగ పూర్తిగా అంతరించిపోయింది.
తరువాత 1647 కొంతమంది శరణార్ధులు (Religious Refugees) ఈ దీవులకు వచ్చి స్థిరపడడ్డారు. 1717 సంవత్సరంలో ఈ దీవులు బ్రిటీష్ వారి కాలనీగా మారినపుడు ఎక్కువ మంది శరణార్ధులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
రహస్య ప్రదేశాలు ఉండటం వలన మరియు ఓడలు ప్రయాణించే మార్గానికి దగ్గరలో ఉండటం వలన బహమాస్ దీవులు సముద్రపు దొంగలకు స్థావరంగా మారాయి.
1973 జూలై 10వ తేదీన బహమాస్ స్వాతంత్రం సంపాదించుకుంది. తరువాత ఈ దీవులు ఆర్ధికపరంగా సేవలందించే ప్రాంతంగాను, పర్యాటక పరంగానూ అభవృద్ధి చెందింది.
బహమాస్ లో 2000 చిన్న దీవులు, 700 ఒకమాదిరి దీవులు కలవు. కానీ వీటిలో 30 దీవులు మాత్రమే ప్రజలు నివసించటానికి యోగ్యమైనవి. ఆండ్రస్ దీవి అన్నిటికంటే పెద్ద దీవి. ప్రావిడెన్స్ దీవిలో జనసాంద్రత ఎక్కువ.
ఈ దేశ విస్తీర్ణం 13,939 చ.కి.మీ. రాజధానా నస్సావూ. అధికార భాష ఇంగ్లీష్. ప్రజలలో 84 శాతం మంది నీగ్రో జాతివారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. వీరి కరెన్సీ బహమాస్ డాలర్స్.
ఇక్కడ పండ్లు, కూరగాయలు ఎక్కువగా పండుతాయి. మత్య్స పరిశ్రమ అభివృద్ధి చెందింది.
బహమాస్ దీవులు ప్రకృతి సౌంర్యానికి పేరుపొందాయు. వీదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకం ద్వారా ఎక్కువ ఆదాయం ఈ దేశానికి వస్తుంది.