header

Barbados…బార్బడోస్...

Barbados…బార్బడోస్...

దక్షిణ అమెరికాకు ఈశాన్యంగా 400 కి.మీ. దూరంలో కరేబియన్ దీవులకు తూర్పున ఉన్న స్వతంత్ర రాజ్యం. రాజవంశీయుల పాలనలో ఉన్న దేశం కూడా. రాజకీయంగా, ఆర్ధికంగా బలపడిన దేశం. ప్రజల జీవన విధానం కూడా ఉన్నతంగా ఉంటుంది.
1625 సంవత్సరంలో జనవాసాలు లేని ఈ ప్రాంతంలో బ్రిటీష్ నావికులు అడుగు పెట్టారు. తరువాత 1627 సంవత్సరంలో ఇంగ్లాండ్ ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఈ దీవిని వ్యవసాయ యోగ్యంగా మార్చి చెరకు పండించటానికి ఆఫ్రికా నుండి బానిసలను దిగుమతి చేసుకున్నారు.
1966 వ సంవత్సరంలో ఈ దేశం బ్రిటీష్ వారినుండి పూర్తి స్వాతంత్రం సంపాదించుకుంది. తరువాత చెరకు ఎక్కువగా ఎగుమతి దేశంగానూ, పర్యాటకపరంగానూ అభివృద్ధి చెందింది.
ఈ దేశ విస్తీర్ణం 430 చ.కి.మీ. ఈ దేశ రాజధాని బ్రిడ్జ్ టౌన్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలలో 92 శాతం మంది నీగ్రోలు. వీరి కరెన్సీ బార్బేడియన్ డాలర్. ప్రజలు ఎక్కువ మంది క్రైస్తవ మతస్తులు.
చెరకు ఎక్కువగా పండుతుంది. మొక్కజొన్న, నిమ్మ, నారింజ జాతుల పండ్లు వ్యవసాయ ఉత్పత్తులు. రొయ్యలు, పంచదార, రమ్ము, సారాయి ఎగుమతులు.
పెట్రోలియం, సహజవాయువు, చేపలు ఈ దేశ సహజ వనరులు.
ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన బీచ్ లు ఉండటం వలన విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకం వలన అధిక ఆదాయం వస్తుంది.