header

Belize….బెలిజి...

Belize….బెలిజి...

బెలీజి దేశం మయాన్ నాగరికతకు సంబంధించిన దేశం. 1500 బి.సి లోనే మయాన్లు ఈ దేశానికి వలస వచ్చారు. 1840 సంవత్సరంలో ఈ దేశం బ్రిటీష్ వారి కాలనీగా మారింది. అందుకే ఈ దేశాన్ని అప్పట్లో బ్రిటీష్ హోండూరస్ గా పిలిచేవారు. 1973 లో తిరిగి బెలిజీగా పిలువబడింది. సెప్టెంబర్ 21, 1981 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాతంత్యం సంపాదించుకుంది.
ఈ దేశ విస్తీర్ణం 22,965 చ.కి.మీ. రాజధాని బెల్మోపాన్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు క్రైస్తవ మతానికి చెందినవారు.
ఈ దేశం నిమ్మ, నారింజపండ్లను ఎక్కువగా పండించి ఎగుమతి చేస్తుంది. చెరకు, ద్రాక్ష, కొబ్బరి ఇతర ఎగుమతులు. కలప కూడా లభిస్తుంది. ఆహార పదార్ధాలను దిగుమతి చేసుకుంటారు.
కలప, చేపలు, హైడ్రోపవర్ సహజ వనరులు. వ్యవసాయ యోగ్యమైన భూములు కలవు