ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వైశాల్యంగల దేశం కెనడా.
కెనడా రాజధాని ఒట్టావా ఈ దేశ జనాభా 3,60,48,521 (2018) దేశ విస్తీర్ణం 99,84,670 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు ఆంగ్లం మరియు ఫ్రెంచ్, వీరీ కరెన్సీ కెనడియన్ డాలర్. కెనడా క్రిస్టియన్ దేశం. కెనడా జాతీయ పతాకం 1:2 పొడవు వెడల్పుతో ఉంటుంది. మధ్యలో తెలుపు రంగులో ఎర్రని మేపుల్ ఆకు, అటూ ఇటూ ఎర్రని రంగులు ఉంటాయి. తెలుపు రంగు శాంతి, నిజాయితీని, ఎరుపు రంగు ధైర్యం, శ్రమ, బలాన్ని సూచిస్తే మేపుల్ ఆకు కెనడా ప్రకృతికి చిహ్నం.
కెనడా అనేది 'కెనట’ అనే పదం నుంచి వచ్చింది. స్థానిక భాషలో దీనర్థం ఆవాసం’, లేదా గ్రామం అని.
ప్రపంచం మొత్తంగా ఉన్న అడవుల్లో 10 శాతం కెనడాలోనే ఉన్నాయి.
కెనడాలో 55 వేలకుపైగా కీటక జాతులు ఉన్నాయి.
కెనాడాలో దాదాపు 30 వేల సరస్సులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరస్సుల్లో ఇది అరవై శాతం. ఎక్కువ మంది విద్యావంతులున్న దేశంగా కూడాఈ దేశానికి పేరుంది.
ప్రపంచంలోనే అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు యూఎస్, కెనడాల మధ్య ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన తీర రేఖగల దేశం. ఏకంగా 2,02,080 కిలోమీటర్ల పొడవుంటుంది.
ప్రపంచంలోనే అతి పొడవైన వీధి ఇక్కడే ఉంది. పేరు యంగ్ స్ట్రీట్. సుమారు 2,000 కిలోమీటర్ల పొడవుంటుంది. టోరంటో స్థాపకుడు జాన్ గ్రేవ్స్ సిమ్‌కో తన స్నేహితుడూ, ప్రాచీన రోమన్ రహదారుల నిపుణుడైన జార్జ్ యంగ్ పేరు మీదుగా ఈ వీధికి పేరు పెట్టారు. యంగ్ సబ్ వే మార్గం కెనడాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి భూగర్భ మెట్రో సిస్టమ్.
గోధుమలు, బార్లీ, నూనె గింజలు, పొగాకు, పండ్లు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు.
ఇనుప ఖనిజం, నికెల్, రాగి, జింక్, బంగారం, సీసం, వెండి, పోటాష్, వజ్రాలు ఈ దేశంలో లభించే సహజ వనరులు. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు కూడా లభిస్తుంది.