header

Costarica …… కోస్టారికా

Costarica …… కోస్టారికా

కోస్టారికా మద్య ఉత్తర అమెరికాలోని ఒక చిన్న స్వతంత్ర రాజ్యం. ఈ దేశానికి ఉత్తరాన నికరగ్యా, దక్షిణాన పనామా దేశాలున్నాయి. మూడు వందల సంవత్సరాల పాటు స్పెయిన్ వలస రాజ్యంగా ఉండి 1821 సంవత్సరలో స్వతంత్ర దేశంగా అవతరించింది. కోస్టారికా వైశాల్యం 51, 100 చ.కి.మీ. . దీని రాజధాని శాన్ జోన్స్. వీరి అధికార భాష స్పానిష్, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ప్రజలు అధికశాతం క్రిస్టియన్స్,స్పెయిన్ నుండి వలస వచ్చినవారే.
రెడ్ ఇండియన్ లతో సంకరమైన యూరోపియన్ ప్రజలను మెస్టిజోలు అంటారు.
రెవాన్టా, జోన్, శాన్ జోన్, శానాపిక్వీ నదులు ఈ దేశంలో కలవు. కగూనా డా అరెవల్, సరస్సులు ప్రధాన జలవనరులు.
కోకో, కాఫీ, అరటిపండ్లు ఎక్కువగా పండిస్తారు. అబాకా, హెంప్ నార, రబ్బరు, ప్రత్తి, చెరకు, వాణిజ్య పంటలు. వరి, మొక్కజొన్న దేశ అవసరాలకు సరిపడా పండిస్తారు.
బంగారం, ఉప్పు ఈ దేశంలో లభించే ఖనిజ సంపద. పశువుల పెంపకం కూడా ఎక్కువగా ఉంది.