header

Cuba / క్యూబా

Cuba / క్యూబా

క్యూబా ఉత్తర అమెరికాకు ఆగ్నేయ దిశలో ఉన్న వెస్ట్ ఇండీస్ దీవులలోని ఒక అందమైన ద్వీప సముదాయం. క్యూబా దీవి కాకుండా చిన్న, పెద్ద దీవులు కలిపి 1600 దాకా ఉన్నాయి. 400 సంవత్సరాలు స్పెయిన్ ఆధీనంలో ఉండి 1898 సం.లో అమెరికా సహాయంతో స్వాతంత్ర్య పోరాటం మొదలు పెట్టింది. 1902 సంవత్సరంలో అమెరికా సైనిక ప్రభుత్వం ఏర్పడింది. 1930 ప్రాంతంలో మరలా బాటిస్టా అనే నియంత పాలనకు గురైంది. 1959 సం.లో ఫిడల్ కాస్ట్రో నాయకత్వంలో విప్లవం చెలరేగి సోషలిస్ట్ ప్రభుత్వ ఏర్పడింది. కాస్త్రో ప్రధాని అయ్యాడు.
ధేశంలో ఒకే ఒక రాజకీయ పక్షం క్యూబా కమ్యునిస్ట్ పార్టీ.
కాస్ట్రో అలీన దేశాల నాయకులలో ఒకరు. క్యూబా రాజధాని హవానా. దేశ వైశాల్యం 1,10,861 చ.కి.మీ. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ క్యూబన్ పెస్కోలు. క్యూబా క్రిస్టియన్ దేశం.
చెరకు, పొగాకు, సిట్రస్ జాతి పండ్లు, కాఫీ, వరి, బంగాళా దుంపలు, బీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. పశుపోషణ కలదు
కోబాల్ట్, నికెల్, ఇనుపఖనిజం,రాగి, క్రోమియం, కలప, పెట్రోల్, సిలికా సహజ సంపదలు. వ్యవసాయ యోగ్యమైన భూమి కలదు.