header

Dominica….డొమినికా

Dominica….డొమినికా

ఇది చాలా చిన్న దేశం. భారతదేశంలోని హైదరాబాద్ కన్నా కొంచె పెద్దది. పర్వతాలతో కూడిన చిన్న ద్వీప దేశం. తూర్పున అట్లాంటిక్ సముద్రం, పశ్చిమాన కరేబియన్ సముద్రం, ఉత్తరాన ఫ్రెంచ్ ద్వీపాలు గ్వాడెలూప్, మదక్షిణాన మార్టనిక్యూ ఉన్నాయి. డొమినికా అంటే లాటిన్ భాషలో ఆదివారం అని అర్ధం.
నవంబర్ 3, 1978 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. 1980 సంవత్సరంలో Mary Eugenia Charles తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైంది
డొమినికా రాజధాని రోసియా. ఇదే ఈ దేశంలో పెద్ద నగరం కూడా. ఎక్కువశాతం జనాభా ఇక్కడే నివసిస్తారు. వీరి భాష ఆంగ్లం. వీరి కరెన్సీ తూర్పు కరేబియన్ డాలర్. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది
ఈ దేశ జాతీయ పక్షి సిసేరియో ప్యారెట్. ఈ పక్షి ఈ దేశంలోనే మాత్రం కనిపిస్తుంది.
కాఫీ, పంచదారలు ఎగుమతి చేయటం ద్వారా ఈ దేశానికి ఆదాయం వస్తుంది.
ఇంత చిన్న దేశంలో 365 నదులు, చాలా జలపాతాలు, అందమైన ఇసుక తీరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన రెండో వేడినీటి సరస్సు ఈ దేశంలోనే ఉంది. దీని పేరు బాయిలింగ్ సరస్సు.క్రిస్టఫర్ కొలంబస్ ఈ ద్వీపదేశాన్ని 1493లో దర్శించాడు. అతి ఎత్తయిన పర్వతం మోరెన డియాబ్లటిన్. ఈ పర్వతం సుమారు 5 వేల అడుగుల ఎత్తు ఉంటుంది.
వీరి జీవన విధానం ప్రత్యేకమైనది. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ.
అగ్నిపర్వతాలు కూడా ఇక్కడ ఎక్కువ. అవి ఎప్పుడూ చురుకుగా ఉంటాయి. చెట్లు, జంతుసంపద ఎక్కువ. అందువలనే ఈ దేశాన్ని కరేబియన్ సముద్రాపు సహజ సంపద ద్వీపం అని పిలుస్తారు.
అరటిపండ్లు, నిమ్మజాతి పండ్లు, మామిడి కాయలు, కొబ్బరి కాయలు, కొకోవా, భూమిలో పండే దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు
కలప. హైడ్రో పవర్, వ్యవసాయ భూములు కలవు.