ఎల్ సాల్వడర్ మధ్య అమెరికాలోని ఒకస్వతంత్ర రాజ్యం. మొట్టమొదటగా ఎల్ సాల్వడర్ లో అమెరికన్ జాతివారైన పోకోమన్స్, లెంకాస్ మరియు పిపెల్స్ అనే తెగలవారు నివసించేవారు. తరువాత యూరోప్ నుండి స్పానిష్ వారు ఇక్కడకు వచ్చారు. 1821 సంవత్సరంలో ఈ దేశానికి స్పెయిన్ నుండి స్వాతంత్రం లభించింది. కానీ ఈ దేశంలో అంతర్యుద్ధం, అశాంతి వలన 1980లో చాలా మంది చనిపోయారు. 1992 సంవత్సరంలో తిరుగుబాటుదారులతో జరిగిన శాంతి ఒప్పందం వలన కొంతవరకు శాంతి నెలకొన్నది.
ఈ దేశ విస్తీర్ణం 21,041 చ.కి.మీ. రాజధాని సాన్ సాల్వడార్, వీరి భాష స్పానిష్. వీరి కరెన్సీ US Dollars. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. 83 శాతం మంది రోమన్ కేథలిక్ శాఖను అనుసరిస్తారు.
పర్వత పానువులలో కాఫీ పండిస్తారు. వరి, మొక్కజొన్న, చెరకు, చిక్కుడు, ప్రత్తి జొన్న, వరి, బీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు.
పశువుల పెంపకం కలదు. పాలు, రొయ్యలు ఇతర ఉత్పత్తులు.
నేలబొగ్గు, రాగి, ఇనుము, సీసం, జింక్ మొదలగునవి ఖనిజ నిక్షేపాలు.
ఆల్కాహాల్, సిగరెట్లు, సిమెంట్, నూలు వస్త్రాలు, హెనెక్వినార, తోలు సామాగ్రి పరిశ్రమలు ఉన్నాయి.