హెయ్‌టీ... కరేబియన్‌ద్వీపమైన హిస్పానియోలా భూభాగాన్ని పంచుకునే రెండు దేశాల్లో చిన్న దేశం. 1492లో క్రిస్టఫర్‌కొలంబస్‌మొదటిసారిగా ఈ దేశంలో అడుగుపెట్టాడు. 1804 జనవరి 1న ఫ్రాన్స్‌నుంచి స్వాతంత్య్రం పొందింది. 1804 - 1915 మధ్యలో 70 మందికిపైగా నియంతలు పరిపాలించారీ దేశాన్ని. అంటే ఈ 111 సంవత్సరాల వ్యవధిలో నియంతలదే అధికారం.
హెయ్‌టీ రాజధాని పోర్టా ప్రిన్స్‌జనాభా: 1,06,04,000. దేశం విస్తీర్ణం 27,750 చదరపు కిలోమీటర్లు భాష: ఫ్రెంచ్, హెయ్‌టియన్‌క్రియోల్‌కరెన్సీ హెయ్‌టియన్‌గౌర్డే. ఈ దేశం క్రిస్టియన్ దేశం
కరేబియన్‌ప్రాంతంలో అత్యధికంగా పర్వతాలున్న దేశమిది. అందుకే దీనికి ‘ల్యాండ్‌ఆఫ్‌ది మౌంటెన్స్’ అని పేరు. ఇక్కడ 8 వేల అడుగుల ఎత్తయిన పర్వత శిఖరాలుంటాయి. ప్రపంచ పురాతన జెండాల్లో ఈ దేశ జెండా ఒకటి. వివిధ జాతుల ఏకతను ఈ పతాక రంగులు సూచిస్తాయి. నీలం రంగు ఆఫ్రికా నుంచి వచ్చిన నల్ల జాతీయుల మూలాలకు గుర్తు. ఇక్కడ స్థిరపడిన విభిన్న ప్రాంత ప్రజలకు ఎరుపు రంగు చిహ్నం.
దేశంలో 53 శాతం మందికి మాత్రమే చదవడం, రాయడం వచ్చు.
1950 నుంచి ఇక్కడి స్త్రీలకు ఓటు హక్కు వచ్చింది. 1915 అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌హెయ్‌టీ దేశంలో శాంతియుత పరిస్థితుల్ని తీసుకురావడం కోసం తమ నావికదళాన్ని పంపారు. 2010లో ఇక్కడ వచ్చిన భారీ భూకంపం రెండు లక్షల మందికిపైగా ప్రజల్ని పొట్టన పెట్టుకుంది. ఎన్నో నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.
ఈ దేశంలోని విద్యార్థుల్లో 10 శాతం మంది మాత్రమే ఉన్నత పాఠశాలలో చేరుతారు. మిగిలిన వారంతా ప్రాథమిక పాఠశాలతోనే చదువు ఆపేస్తారు. పర్యటక రంగం ఇక్కడ అత్యధికంగా లాభాల్ని తెచ్చిపెట్టే పరిశ్రమ. దేశ దేశాల నుంచి లక్షల్లో సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ 15 ఏళ్లలోపు పిల్లలు 20 శాతం మంది కంటే తక్కువగా ఉంటారు.
కాఫీ, చెరకు, మామిడి పండ్లు, వరి, కర్రపెండలం దుంపలు పండుతాయి
బాక్సైట్, రాగి, బంగారం, మార్పుల్స్ సహస సంపదలు