header

Honduras….హోండూరాస్....

Honduras….హోండూరాస్....

హోండూరాస్ మధ్య అమెరికాలోని స్వతంత్ర గణ రాజ్యం. ఒకప్పుడు స్పెయిన్ వలస రాజ్యం. 250 AD నుండి 900AD వరకు మయాన్ సంస్కృతి ఇక్కడ వర్ధిల్లింది. 1821వ సంవత్సరంలో స్పెయిన్ నుండి స్వాతంత్రం పొందింది.
ఈ దేశ విస్తీర్ణం 1,12, 088 చ.కి.మీ.. ఈ దేశ రాజధాని టెగుసిలల్ఫా. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ lempira. 80 శాతం మంది ప్రజలు మెస్టిజో అనే సంకరజాతులవారు, రెడ్ ఇండియన్ లతో సంకరణం చెందిన స్పెయిన్ దేశీయులు, నీగ్రో జాతివారున్నారు.
ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. ప్రజలు రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు .
పటూకా నది, అగౌన్ నది, సికో నది, గేయాసీ నది, ఉలా నది జలాధారాలు. .
హోండూరాస్ అరటిపండ్ల దేశంగా ప్రసిద్ధి చెందినది. అరటిపండ్లను ఎక్కువగా పండించి ఎగుమతి చేస్తారు. అరటిపండ్ల ఎగుమతికి వీలుగా రైల్వే వ్యవస్ధ కూడా ఉన్నది. .
కాఫీ, పొగాకు, మొక్కజొన్న, ప్రత్తి, వరి, చెరకు ప్రధానమైన పంటలు. .
వెండి లభ్యత ఉంది. కలప పరిశ్రమ, ఆహారపానీయాలు, సిగరెట్ల తయారీ, బీరు, సారాయి, సిమెంట్, పంచదార, నూలు వస్త్రాలు ముఖ్యమైన పరిశ్రమలు.