జమైకా కరీబియన్‌సముద్రంలో ఉన్న పెద్ద ద్వీప దేశాలలో మూడవది . సార్వభౌమ దేశమే అయినా లాంఛన చక్రవర్తిగా బ్రిటన్‌ఎలిజబిత్‌వ్యవహరిస్తారు. 1494 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఈ దేశ ఉనికిని కనుగొన్నాడు. ఈ రాజధాని కింగ్‌స్టన్. దేశ జనాభా 29,50,210 . ఈ దేశ విస్తీర్ణం 10,991 చదరపు కిలోమీటర్లు వీరి భాష ఆంగ్లం. కరెన్సీ జమైకన్‌డాలర్. ఈ దేశం క్రిస్టియన్ దేశం. .
ఈ దేశ జెండాలోని నలుపు రంగు కష్టాలను అధిగమించడానికి సూచన అయితే, బంగారువర్ణం సహజ సంపదకూ, సూర్యకాంతికీ గుర్తు, ఆకుపచ్చ రంగు ఆశాభావానికీ, వ్యవసాయ వనరులకూ సూచన. 1962 సం. ఆగస్ట్ 6 తేదీన జమైకా గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ప్రపంచంలోనే అత్యధిక చర్చిలున్న ప్రాంతమిది. 1600 చర్చిలతో గిన్నిస్‌రికార్డుకెక్కింది. ఉత్తర అమెరికా, కెనడాల తర్వాత అత్యధిక శాతం ప్రజలు ఆంగ్లం మాట్లాడేది ఇక్కడే. 116 దేశాల్లోని ప్రజలు వీసా లేకున్నా జమైకాకు వెళ్లవచ్చు. ఇలా అనుమతి లభించిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సీతాకోక చిలుక ‘స్వాలోటేల్’ నివాసం ఈ దేశమే. ఇక్కడ కేవలం ఎనిమిది జాతుల పాములు ఉంటాయి. అవి కూడా విషరహితమైనవి. 1872లో చెరకు తోటలను ధ్వంసం చేస్తున్న ఎలుకల్ని చంపడానికి ఈ ప్రాంతానికి ముంగిసల్ని తీసుకొచ్చారట. ఎలుకలతో పాటు అవి పాముల పని కూడా పట్టడంతో ఈ దీవిలో పాముల సంఖ్య బాగా తగ్గిపోయింది.
ప్రఖ్యాత పరుగుల వీరులు ఉస్సేన్‌బోల్ట్, యోహాన్‌బ్లేక్‌లు ఇక్కడి వారే. 200కి పైగా ఆర్కిడ్‌పూల జాతులున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా అరటి పండ్లని ఎగుమతి చేసే దేశం ఇదే. జేమ్స్‌బాండ్‌సృష్టికర్త ఇయాన్‌ఫ్లెమింగ్‌జమైకాలోనే ‘గోల్డెన్‌ఐ’ పేరిట సొంత ఇల్లు కట్టుకున్నారు.
ప్రాచుర్యం పొందిన ‘రెగే’ సంగీత శైలి పుట్టింది ఇక్కడే. ఈ ద్వీపదేశం చిన్నదే అయినా పర్యటకానికి పేరు పొందింది. ఏటా పదిలక్షలకు పైగా పర్యాటకులు వస్తుంటారు.