నికరాగ్యా మధ్య అమెరికాలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. ఈ దేశానికి ఉత్తరాన హోండూరస్, తూర్పున కరేబియన్ సముద్రం, దక్షిణాన కోస్టారికా, పశ్చిమాన ఫసిఫిక్ సముద్రం సరిహద్దులు. దేశ రాజధాని మనగ్యా. ఈ దేశ విస్తీర్ణం 1,30,375 చ.కి.మీటర్లు. వీరి భాష స్పానిష్ ఈ దేశ కరెన్సీ కర్డోబా. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. ప్రజలలో 72.9 శాతం మంది రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. 15 శాతం మంది ఎవాంజిలికల్ సంప్రదాయాన్ని పాటిస్తారు
1821 సంవత్సరలో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశానికి మధ్య అమెరికా ఉష్ణమండల స్వర్గం అనిపేరు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు నికరాగ్యా.
మధ్య అమెరికాలోని ప్రఖ్యాత నృత్యం పాలో డి మాయో పుట్టింది ఇక్కడే. ఇక్కడి ప్రపలు స్పానిష్, ఆంగ్ల భాషలతో పాటు కొన్ని స్థానిక భాషలను, వేల సంవత్సరాలనాటి మయాన్ భాషను కూడా మాట్లాడతారు.
నికరగ్యాకు భారతదేశానికి అవినాభావ సంభందం ఉన్నది. భారతదేశం నుండి నికరాగ్యాకు వలస వచ్చిన తెగ పేరు నికరా. అగ్యా అంటే స్పానిష్ భాషలో నీళ్లు అని అర్థం. వీటి మీదే ఈ దేశానికి నికరగ్యా అనే పేరు వచ్చింది.
మధ్య అమెరికా మొత్తంలో అతి ప్రాచీనమైన నగరం ఉన్నది ఈ దేశంలోనే. దీని పేరు రూయిన్స్ ఆఫ్ లియోన్ వైజో. ఇది 1500 వందల సంవత్సరాల క్రితం నాటిది. లేక్ నికరాగ్వా అతి పెద్దదైన సహజసిద్ధమైన సరస్సు. ఇందులో 430 అగ్నిపర్వత ద్వీపాలున్నాయి. అంతేకాకుండా ఇది మంచి పర్యాటక ప్రాంతం. తాగునీటిని ఎంతో మందికి అందిస్తుంది.
కాఫీ, అరటిపండ్లు, చెరకు, ప్రత్తి, వరి, మొక్కజొన్న, పొగాకు, నువ్వులు, సోయాబీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, కోళ్ల పరిశ్రమ, పందిమాంసం, పాల ఉత్పత్తులు ఇతరాలు.
బంగారం, వెండి, రాగి. టంగ్ స్టన్, జింక్, సీసం, కలప, చేపలు సహజ వనరులు.