బొలీవియా దేశం దక్షిణ అమెరికా ఖండపు మధ్య ప్రాంతంలో ఉంటుంది.
ఎరుపు రంగు సైనికుల ధైర్యానికి సూచిక, ఆకుపచ్చరంగు సారవంతమైన లక్షణానికి, పసుపు ఖనిజ సంపదకు గుర్తు.
బొలీవియా రాజధాని సుక్రె, జనాభా 1,14,10,651, విస్తీర్ణం 10,98,581 చదరపు కిలోమీటర్లు, భాషలు స్పానిష్, క్వెచువా, అయిమారా, కరెన్సీ బొలీవియానొ ఈ దేశంలో 30 అధికారిక భాషలున్నాయి. ఆగస్ట్ 6, 1825 సంవత్సరంలో స్పెయిన్ దేశం నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశం క్రిస్టియన్ దేశం. ప్రజలలో 95 శాతం మంది రోమన్ కేధలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు.
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రెండు నగరాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ఒకటి పోటోస్, రెండోది లా పాజ్‌నగరం. లాపాజ్‌కు దగ్గర్లో ఉండే ‘కమినో డె లాస్‌యుంగస్‌రోడ్డు’ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. ఈ రహదారిపై ఏటా వందలాది ప్రమాదాలు జరుగుతాయి.
ప్రపంచంలోనే ఎత్తయిన ‘టిటికాకా’ సరస్సు ఈ దేశంలోనే ఉన్నది. సముద్ర మట్టానికి 3,810 మీటర్ల ఎత్తున్న ఈ సరస్సును దాటడానికి ఆరు గంటల సమయం పడుతుంది. అత్యంత లోతైన సరస్సుల్లో ఇదీ ఒకటి. .
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఇనుప ఖనిజాల నిల్వలు ఉన్నాయి. మొట్టమొదటి అధ్యక్షుడు సైమన్‌బొలీవర్‌పేరు మీదుగా ఈ దేశానికి బొలీవియా అని పెట్టారు.ప్రపంచంలోనే అతి పెద్ద సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉంది. అత్యంత తడిగా ఉండే ప్రాంతమిది. ఎందుకంటే ఏడాదిలో భారీగా ఎనిమిది మీటర్లకుపైగా వర్షపాతం కురుస్తుంది. .
‘సలార్‌డి ఉయుని’ పేరిట ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు క్షేత్రం ఉంది. ఉప్పు ఎడారిగా పిలిచే ఈ ప్రదేశం 11 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 64 మిలియన్‌టన్నుల ఉప్పు ఉంటుంది. పాలాసియోడి సాల్‌పేరిట ఇక్కడ అచ్చంగా ఉప్పుతో కట్టిన హోటల్‌ఉంటుంది. ఈ వింతప్రాంతాన్ని చూడ్డానికి ఏటా లక్షల్లో సందర్శకులు వస్తుంటారు. .
సోయాబీన్స్, కాఫీ, కోకో, ప్రత్తి, మొక్కజొన్న, చెరకు, వరి, బంగాళాదుంపలు పండిస్తారు.కలప లభ్యత కలదు.
సహజవాయివు, పెట్రోలియం, జింక్, టంగ్ స్టన్, వెండి, ఇనుము, సీసం, బంగారం, కలప, హైడ్రోపవర్ సహజ సంపదలు.