header

Brazil…బ్రెజిల్..

Brazil…బ్రెజిల్..

బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖంఢంలోని ఒక స్వతంత్ర గణ రాజ్యం. లాటిన్ అమెరికా దేశాలలో పెద్దది. పోర్చుగల్ వలసరాజ్యంగా ఉండి 1889 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశ విస్తీర్ణం 85,11,965 చ.కి.మీ. రాజధాని బ్రసీలియా నగరం. వీరి అధికార భాష పోర్చుగీసు. ప్రజలు మెస్టిజో, రెడ్ ఇండియన్ తెగలవారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. పూర్వ రియోడిజ నీరోలో ఉండే రాజధానిని కొత్తగా నిర్మించిన బ్రసీలియాకు 1960 సంవత్సరంలో మార్చారు.
ఈ దేశంలో అమెజాన్ నది పెద్దది. దీని పరివాహక ప్రాంతం ఎక్కువ. బ్రూనో నది, గ్రాండ్ నది, మదీరా నది, నీగ్రో నది, పారణ నది, ఫ్రాన్సిస్కో నది, టాపోజీస్ నది, టోకాన్టిన్స్ నది, ఉరుగ్వే నది, జింగూనది ఇతర జలవనరులు.
దేశంలో ఎక్కువభాగం కీకారణ్యాలతో కూడి ఉంది. సాగునేల ఎక్కువ. ఇంత ఎక్కువగా సహజసంపద ఉన్నప్పటికీ ప్రజలు ఐదింట ఒక భాగాన్నే ఉపయోగించుకుంటారు. అయినప్పటికీ బ్రెజిల్ ఆహారోత్పత్తిలో ప్రపంచంలోనే ఆగ్రస్థానంలో ఉంది.
వరి, చెరకు, పొగాకు, సోయా చిక్కడు, రబ్బరు, అనాస పండ్లు, నారింజ పండ్లు, కోకో, కాఫీ, ప్రత్తి, మొక్కజొన్న, కర్రపెండలం, చిక్కుడు, అరటి పండ్లు వ్వవసాయ ఉత్పత్తులు. ఆహార ఉత్పత్తులలో బ్రెజిల్ స్వయం సమృద్దిన సాధించింది. పశువుల పెంపకం ప్రజలకు ప్రధాన జీవనోపాధి.
బంగారం, పారిశ్రామిక వజ్రాలు, ఇనుపరాయు, మాంగనీస్, కాగితం, రబ్బరు, ఉక్కు, జవుళీ, టైర్లు, రైలు ఇంజనులు, గృహ పరికరాలు, తోలు సామాగ్రి, రసాయనిక ద్రవ్వాలు, మోటారు కార్లు, సిమెంట్ మొదలగునవి పరిశ్రమలు.
జలవిద్యుత్ ఎక్కువ. సామీక్పాలో, బెలోహారి జంటో నగరాలు పారిశ్రామిక కేంద్రాలు.