దక్షిణ అమెరికాలోని చిలి ఒక స్వతంత్ర దేశం. ఈ ఖండంలోని పశ్చిమ భాగాన పసిఫిక్ మహా సముద్రాన్ని ఆనుకుని ఉన్న పొడుగాటి చీలికగా ఆండీస్ పర్వతశ్రేణిని ఆనుకుని ఈ దేశం వ్యాపించి ఉన్నది. లాటిన్ అమెరికా దేశాలు అన్నిటిలోనూ అత్యంతం పారిశ్రామిక ప్రగతి సాధించిన దేశం చిలి. చిలీ దేశ విస్తీర్ణం 7,56,945 చ.కి.మీ. వీరి భాష స్పానిష్. చిలీ రాజధాని సాంటియాగో. వీరి కరెన్సీ చీలీ పెస్కోలు. 86 శాతం మంది జనాభా క్రైస్తవులే. వీరు రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు
15వ శతాబ్దంలో స్పానిష్ వారు ఈ దేశానికి రాకపోకలు ప్రారంభించి మెల్లగా ఇక్కడ ఉన్న ఇన్కా జాతివారి మీద ఆధిపత్యం సాధించి దేశాన్ని ఆక్రమించుకున్నారు. సుమారుగా 300 సం.లు స్పానిష్ పాలనలో ఈ దేశం ఉంది. ఓహిగిన్స్ నాయకత్వంలో ఫ్రెంచ్ వారిని ఎదిరించి 1818 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు.
ఇనుప రాయి, రాగి, నైట్రేట్ ఖనిజ సంపదలు ఈ దేశంలో పుష్కలంగా ఉన్నాయి. చిలీ రాగి ఖనిజం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. సోడియం నైట్రేట్ ను ప్రపంచానికంతటికి ఎగుమతి చేస్తుంది చిలీ.
బంగారం, సీసం, వెండి, జింకు, పెట్రోలియం లభిస్తాయి. చిలీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం.
పచ్చిక బయళ్లు పుష్కలంగా ఉండటం చేత పందుల పెంపకం, గొర్రెల పెంపకం ఎక్కువ.
బార్లీ, వరి, రై ధాన్యం, పొద్దు తిరుగుడు, గోధుమ, పుగాకు, బఠానీలు, చిక్కుడు, బంగాళా దుంపలు, ఓట్ ధాన్యం, బాగా పండుతాయి.