header

Paraguay…పరాగ్వే..

Paraguay…పరాగ్వే..

పరాగ్వే దక్షిణ అమెరికాలోని స్వతంత్ర దేశం. ఈ దేశానికి ఉత్తరాన బొలీవియా,బ్రెజిల్, తూర్పున అర్జెంటీనా దేశాలు ఉన్నాయి. 1537 సంలో స్పానిష్ వారు ఈ దేశానికి వచ్చి అసన్ సియాన్ నగరాన్ని ఏర్పరచారు. అప్పటినుండి అసన్ సియాన్ స్పానిష్ వారి కాలనీగా మారింది. 1811 సం.లో స్పానిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది.
ఈ దేశ విస్తీర్ణం 4,06,752 చ.కి.మీ. రాజధాని నగరం అసన్ సియాన్. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ Guarani. ప్రజలు క్రైస్తవ మతస్తులు. మెస్టిజో, అమెరికన్ ఇండియన్ జాతులకు చెందినవారు.
పరాగ్వే నది, పరవా నది ప్రధానమైన జలవనరులు. ప్రత్తి ప్రధానమైన పంట. వ్యవసాయపరంగా అభివృద్ది చెందుచున్న దేశం. కర్రపెండలం, చిలగడ దుంపలు, సోయా చిక్కుడు, చెరకు, పొగాకు, వరి, నారింజ అరటి వ్యవసాయ ఉత్పత్తులు. పశువుల పెంపకం ప్రజల జీవనోపాధి.
రాజధాని అసన్ సియాన్ పర్యాటక ప్రదేశం. ఇసుకరాయి సరస్సు విహార స్థలం మరియు ఎన్కార్నేషన్ ప్రాచీన శిధిలాలు ఉన్న గుట్ట.