header

Peru….పెరూ….

Peru….పెరూ….

పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణిలోని స్వతంత్రదేశం పెరూ. ఒకప్పుడు పెరూ దేశం ఇన్కా అనబడే రెడ్ ఇండియన్ల స్థానం. 16వ శతాబ్ధంలో స్పేనిష్ వారిచే ఆక్రమించబడి 1821 సంవత్సరంలో స్వతంత్ర గణరాజ్యంగా రూపొందింది.
ఈ దేశ విస్తీర్ణం 12,81,215 చ.కి.మీ. పెరూ రాజధాని లీయా. వీరి అధికార భాష స్పేనిష్, క్వెచువా. వీరి కరెన్సీ సాల్. ప్రజలు కేథలిక్ క్రైస్తవమతాన్ని పాటిస్తారు. .
ఆల్పాకా, నీకూనా, లామా వంటి అపూర్వమైన జంతుజాలం ఈ దేశంలో కనిపిస్తాయి. అభయారణ్యాలలో ఈ జంతువులు రక్షించబడుచున్నవి. .
అమెజాన్ నదికి ప్రారంభలో ఉన్న మారణన్ నది, నాపోనది, ఉకాయాలీ నది ఈ దేశ తూర్పు మైదానాలలో ప్రవహిస్తున్నాయి. ఆండీస్ కొండల నుంచి ప్రవహించే వాగులు వలన సముద్రతీరంలో సేద్యం చేస్తున్నారు. ప్రత్తి, చెరకు, కాఫీ, వరి, బంగాళా దుంపలు మొక్కజొన్న, అరటి, కర్రపెడలం వ్యవసాయ పంటలు.
మొక్కజొన్నకు ఆదిమ స్థానం పెరూ దేశమే. రెడ్ ఇండియన్ జాతులకు మొక్కజొన్న ముఖ్య ఆహారం .
మత్సపరిశ్రమ ఎక్కువగా ఉన్నది. వెండి, రాగి, బంగారం, ఇనుపరాయి, సీసం, గంధకం. ఫాస్పేట్ ఖనిజాలు ఈ దేశంలో లభిస్తాయి
. చించాదీవులలో పిట్టల రెట్ట భారీ రాసులలో లభిస్తుంది. దీనిని పొలాలకు ఎరువుగా వేస్తారు. పెరూ రైతాంగం రసాయనిక ఎరువులు పెద్దగా వాడరు.