పూర్వం ఈ దేశం స్పెయిన్‌పాలనలో ఉండేది. 15 ఏళ్ల పోరాటాల అనంతరం 1821లో పూర్తి స్వతంత్రం పొందింది. వెనిజులా రాజధాని కరాకస్ జనాభా 3.1 కోట్లు ఈ దేశ విస్తీర్ణం : 9,16,445 చ.కి.మీ. వీరి కరెన్సీ వెనిజులన్‌బొలివర్. భాష స్పానిష్. ఈ దేశం క్రిస్టియన్ మతానికి రెందినది. ప్రజలలో 96 శాతం మంది రోమన్ కేథలిక సంప్రదాయాన్ని పాటిస్తారు.
జెండాలోని ఎరుపు, పసుపు రంగులు ధైర్యానికి, నీలం స్వతంత్ర వెనిజులాకి గుర్తులు. మధ్యలో ఎనిమిది తెల్లటి నక్షత్రాలు విప్లవానికి ప్రతీక.
వెనిజులాలో నీటికంటే చమురే చవక. సౌదీ అరేబియా తరువాత చమురు నిక్షేపాలు అధికంగా ఉన్న దేశం ఇది. మొన్న మొన్నటి వరకు ఇక్కడ లీటరు సబ్సిడీ పెట్రోల్‌ధర ఒక రూపాయిలోపే! దక్షిణ అమెరికా ఖండంలో విస్తరించి ఉన్న అతిపెద్ద అడవి అమెజాన్‌లో కొంత భాగం ఈ దేశంలోనూ ఉంది. ప్రపంచంలో ఎక్కువ జీవజాతులు ఉన్న దేశాల్లో వెనిజులా ఏడోది. అ దేశంలో వాతావరణం స్థిరంగా ఉండదు. ఏడాదిలో 160 రాత్రులపాటు మెరుపులు, పిడుగులు వస్తూనే ఉంటాయి. తుపానులూ కూడా ఎక్కువగా వస్తాయి. .
వెనిజులా అనే పదం... వెనిజోలియా (బుల్లి వెనిస్) అనే ఇటాలియన్‌పదం నుంచి వచ్చింది. అక్కడి మారాకైబోలో ఉన్న సరస్సులో ప్రాచీనులు కర్రలుపాతి దానిపైనే ఇళ్లు కట్టుకున్నారు. అది వెన్నిస్‌ను పోలినట్టు ఉండటంతో దీనికి వెనిజులా అని పేరొచ్చింది. .
ప్రపంచంలోనే ఎత్తయిన ఏంజెల్‌జలపాతం ఇక్కడిదే. దీని పొడవు 3,212 అడుగులు. ఇది నయాగరా జలపాతం కంటే పదిహేడు రెట్లు ఎత్తయినది.
ప్రపంచంలో ఎక్కువసార్లు అందాలపోటీల్లో గెలిచిన అమ్మాయిలు ఈ దేశానికి చెందినవారే. .
ఇక్కడున్న ‘శాన్‌ఆంటోనియా జైలు’ చిత్రంగా ఉంటుంది. ఈ జైలుని, దానికి ఆనుకుని ఉన్న బీచ్‌ని చూసేందుకు ఇక్కడికి ఎక్కువ మంది పర్యటకులు వస్తుంటారు. వారందరికీ ఇక్కడి ఖైదీలు నోరూరించే వంటకాలు చేసి పెడతారు. వివిధ స్టాళ్లను నడుపుతారు. ఇక్కడ ఖైదీలు కుటుంబంతో సహా ఉండే వీలుంది. వారికిక్కడ టీవీలు, ఏసీలు, ఈత కొలను, క్రీడా మైదానాలు, నైట్‌క్లబ్‌లాంటి సకల సౌకర్యాలు ఉంటాయి. మరణశిక్షను రద్దు చేసిన ఆధునిక దేశమిది. 1863లోనే ఈ నిర్ణయం తీసుకుంది. .
రాజధాని కరాకస్‌లో ఓ అమెరికన్‌టీవీ షోకోసం కట్టి, అసంపూర్తిగా వదిలేసిన 45 అంతస్తుల ఆకాశ హర్మ్యం ఒకటుంది. దాన్ని 2007లో మురికివాడల్లోని ప్రజలుండేందుకు కేటాయించారు. దీంతో ఎత్తయిన మురికివాడగా ఈ భవనం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దానిలో 3000 మంది జనం నివసిస్తున్నారు. ఇందులోనే చిన్నచిన్న దుకాణాలూ ఉన్నాయి. .
ఈ దేశంలో ఏకంగా 25000 ఆర్కిడ్‌పూల జాతులున్నాయి. ఈ దేశ జాతీయ పుష్పం పేరు ‘ఫ్లోర్‌దే మయో ఆర్కిడ్’. ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక విగ్రహం ఇక్కడే ఉంది. దీని పేరు విర్జెన్‌డిలాపాజెన్‌ట్రుజిల్లో.