header

Bittergourd Bajjeelu….కాకర బజ్జీలు

Bittergourd Bajjeelu….కాకర బజ్జీలు
కావల్సినవి
కాకరకాయలు – మీడియం సైజ్ పావుకేజీ
మజ్జిగ – కప్పు
పసుపు – అరచెంచా
ఉప్పు – తగినంత
ఉల్లిపాయలు – రెండు
అల్లం - చెంచా
వెల్లుల్లి ముద్ద - చెంచా
సెనగపిండి – 150 గ్రాములు
వాము : టేబుల్ స్పూన్
కారం - రెండు చెంచాలు
నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం
కాకరకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా తరిగి.. మధ్యలో కొద్దిగా గాటు పెట్టాలి. కాకరముక్కలలో మజ్జిగ, పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి. తువాత ఉల్లి పాయలను, అల్లం, వెల్లుల్లి లను మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. ఓ పాత్రలో ఈమిశ్రమంలో చెంచా సెనగపిండి, కారం, తగినంత ఉప్పు తీసుకుని అన్నింటినీ కొద్దిగా నీరు కలిపి గట్టి పిండిలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయ ముక్కల్లో సమానంగా సర్దాలి. మిగిలిన సెనగపిండిని బజ్జీలపిండిలా గరిటెజారుగా కలపాలి. అవసరమనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. కాకరముక్కల్ని ఇందులో ముంచి.. కాగుతున్న నూనెలో వేయించు కోవాలిసరిపోతుంది. కాకర బజ్జీలు ఆరోగ్యానికి చాలా మంచివి.