header

Diabetic Food

డయాబెటిక్ (షుగర్ ) పేషంట్లు తీసుకోవాల్సిన ఆహారం (అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వారిచే సిఫార్సు చేయబడిన ఆహారం)
వంటలు అతిగా (మొత్తగా) ఉడికించరాదు. (మెత్తగా ఉండటం వలన త్వరగా జీర్ణమై గ్లూకోజ్ శాతం త్వరగా పెరుగుతుంది) అతిగా వేపుడు చేసిన పదార్ధాలు తినరాదు.గ్రిల్ చేసినవి, బేకింగ్ చేసినవి (నూనెలేకుండా) మంచివి. మొలకెత్తిన గింజలు. క్రీమ్ లేని తండూరి పదార్థాలు మంచివి క్రీమ్స్ తినరాదు. నెయ్యి, డాల్డాలు వాడరాదు
త్వరగా జీర్ణం అయ్యే పదార్థాలు తినరాదు. (పాలిష్ బియ్యం, జల్లించిన గోధుమ పిండి, మైదా మొదలగునవి) నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలు మంచివి ముడిబియ్యం, చిరుధాన్యాలు, గోధుమ పిండి జల్లెడ పట్టరాదు


COOKING METHODS

Do not overcook, the lesser cooked the better for Diabetics, highly processed food preparations are quickly absorbed and give immediate peaks of blood glucose, deep frying s not recommended- stir fry if absolutely essential. Boiled and parboiled is also preferred. Roasting, grill and baking are also preferred method of preparation as they require less oil.Sprouted pulses are also recommended.
Dalia, Tandoori dishes { but do not marinate in cream ( malai)}, par boiled vegetables with cereals, All subzis prepared with healthy oil avoid potatoes in subzis. Sprouted daals moong, chana either raw or lightly fried . Do not use cream, Desi ghee even for tadka

చిక్కుళ్ళు
అన్నిరకాల చిక్కుళ్ళు, బీన్స్ లో పీచు, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండి డయాబెటిక్ వారికి సమతులాహారంగా పనిచేస్తాయి. మాంసాహారం కంటే బలవర్థకమైన ఆహారం చిక్కుళ్ళు.
Beans

Whether you prefer kidney, pinto, navy, or black beans, you can’t find better nutrition than that provided by beans. They are very high in fiber, giving you about 1/3 of your daily requirement in just a ½ cup, and are also good sources of magnesium and potassium. They are considered starchy vegetables, but ½ cup provides as much protein as an ounce of meat without the saturated fat.

ఆకుపచ్చని ఆకుకూరలు
బచ్చలికూర,మెంతికూర, తోటకూర మొదలగునవి తక్కువ కేలోరీలు, కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా కూడా తినవచ్చు.
Dark Green Leafy Vegetables

Dark Green Leafy Vegetables Spinach, collards, kale – these powerhouse foods are so low in calories and carbohydrate. You can’t eat too much.

బెర్రిజాతి పండ్లు
అన్ని రకాల బెర్రిజాతి పండ్లు స్ట్రాబెర్రీస్ మొదలగునవి యాంటాక్సిడెంట్లు, విటమిన్లు మరియు పీచు కలిగి ఉంటాయి.
Berries

Which are your favorites: blueberries, strawberries or another variety? Regardless, they are all packed with antioxidants, vitamins and fiber. Make a parfait alternating the fruit with light, non-fat yogurt for a new favorite dessert.

దబ్బకాయ, ఆరెంజ్, నిమ్మ జాతి పండ్లలో కరిగే పీచు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కనుక వీటిని రోజువారీ ఆహారంలో తీసుకొనటం మంచిది. <

Citrus Fruit

Grapefruit, oranges, lemons and limes. Pick your favorites and get part of your daily dose of soluble fiber and vitamin C.

చిలగడదుంపలు
విటమిన్ ఎ మరియు పీచు గల ఆహారం. రక్తంలో తక్కువగా సుగర్ శాతం పెరుగుతుంది

Sweet Potatoes టమాటోలు
డయాబెటిక్ వారికి టమాటోలు మంచి ఆహారం. పచ్చివి గాని, కూరలుగా గాని, సూప్ గా కానీ తీసుకొనవచ్చు. టమాటోలు విటమిన్ సి, ఐరన్, విటమిన్ ఇ లు కలిగి ఉంటాయి. రోజువారీ తినవచ్చు

Tomatoes

An old standby where everyone can find a favorite. The good news is that no matter how you like your tomatoes, pureed, raw, or in a sauce, you’re eating vital nutrients like vitamin C, iron, vitamin E.

మాంసాహారం :
చేపలలో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. వారంలో 2-3 సార్లు మితంగా తినవచ్చు. వేపుడు మాత్రం తినరాదు. మాంసాహారం : స్కిన్ లెస్ చికెన్ తినవచ్చు. సాల్మన్ ఫిష్ మంచిది. అన్ని రకాల మటన్ తినరాదు.

Fish

High in Omega-3 Fatty Acids Salmon is a favorite in this category. Stay away from the breaded and deep fat fried variety... they don’t count in your goal of 6-9 ounces of fish per week.

చిరుధాన్యాలు :
అన్నిరకాల చిరుధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగలు, సామా రైస్ మొదలగునవి) డయాబెటిక్ వారికి మేలు చేస్తాయి. తెల్లని బ్రెడ్ కంటే(మైదాతో చేసిన)గోధుమతో చేసి బ్రెడ్ (బ్రౌన్ బ్రెడ్) తినటం మంచిది. పెరల్డ్ బార్లీ, ఓట్ మీల్ లలో పీచు, మరియు పొటాషియం ఉంటాయి.
చిరుధాన్యాలు : చిరుధాన్యాలతో చేసిన వంటకాలు (జొన్నలు, రాగులు,వరిగలు, సజ్జలు మొ.నవి) గోధుమలు, ఓట్స్ తో చేసిన వంటకాలు తినవచ్చు.
ఇవి తినరాదు : బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా, కేసరి, హల్వా, మైదాతో చేసి పదార్ధాలు బిస్కట్లు తినరాదు. పూర్తిగా పాలిష్ చేసిన ధాన్యాలుతో చేసిన పదార్థాలు త్వరగా అరిగిపోయి రక్తంలో గ్లూకోజ్ శాతం ఒక్కసారిగా పెరుగుతుంది.

Whole Grains

It’s the germ and bran of the whole grain you’re after. It contains all the nutrients a grain product has to offer. When you purchase processed grains like bread made from enriched wheat flour, you don’t get these. A few more of the nutrients these foods offer are magnesium, chromium, omega 3 fatty acids and folate. Pearled barley and oatmeal are a source of fiber and potassium.Whole grains Cereals , with lower glycemic - Wheat, Corn, Oat Dalia ( broken wheat),Oat meal, avoid sooji preparations like upma, halwa. విత్తనాలు మరియు పప్ఫు ధాన్యాలు :
శనగలు, పెసలు, అలసందులు, రాజ్మాలు తినవచ్చు. మూంగ్ దాల్, మసూర్ దాల్ (వేయించినవి తినరాదు)

PULSES and DALLS

Chickpeas, Lentil & green gram ( only whole- not broken), Whole daals / pulses are much more preferable to broken / processed daals, they have lesser calories and high fibre content, as a result they are slowly digested and absorbed so they do not give high peaks of blood sugar after meals. Kidney beans ( Rajma) is also beneficial- it is a legume has high content of soluble fibres, it helps lower Total cholesterol and raise HDL ( protective or good cholesterol) Chole, Sabut moong, Sabut masoor, Arhar, Rajmah Avoid Urad, Moong and Masoor daals ( broken )
డయాబెటిక్ వారికి అద్భుతమైన ఆహారం గోధుమ రవ్వ
గోధుమ రవ్వ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. అల్పాహారంగా , లంచ్ లో లేదా డిన్నర్ లో తీసుకోవచ్చు. దీనితో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల్ కూడా లభిస్తాయి.
బరువు నియంత్రణ
గోధుమ రవ్వ లో ఫైబర్ లు కూడా అధికంగా ఉంటాయి, ఇవి ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన ను కలిగిస్తాయి, దీనితో తినాలనే ఎక్కువ కోరికను అదుపులో ఉంచుతాయి. తద్వారా, జంక్ ఫుడ్ తినడానికి దూరంగా ఉండవచ్చు. ఉదయాన్నే అల్పాహారంగా దీన్ని తీసుకోవడం తో రోజంత ఉత్సాహంగా ఉండడమే కాదు, అవసరమైన న్యూట్రిషన్ల్ కూడా లభిస్తాయి.
బ్లడ్ షుగర్ ను నియంత్రణ
షుగర్ ఉన్నవారికి గోధుమ రవ్వ సరైన ఆహారం. దీంట్లోని తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ మరియు కాంప్లెక్స్ కార్బ్స్ శరీరంలోకి గ్లూకోస్ ను నియంత్రణను క్రమబద్దికరిస్తాయి. దీనితో షుగర్ లెవెల్స్ నియంత్రించడం సులువు అవుతుంది.
మెటబాలిజం పెరుగుదల
రోజు గోధమరవ్వతో చేసిన పదార్ధాలు తినడం వలన శరీర సామర్థ్యం పెరిగి మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. అంతేకాక, ఇది మలబద్దకాన్ని కూడా నిర్మూలించడంలో ఎంతగానో దోహద పడుతుంది. దీనిలోని హై ఫైబర్ మరియు ప్రోటీన్స్ వలన గోధమరవ్వను సూపర్ ఫుడ్ గా చెబుతారు

గింజలు :
అక్రోట్స్, అవిశె గింజలు ఒమేగా 3 కలిగి ఉండి డయాబెటిక్ వారు తినదగినవి.

Nuts

An ounce of nuts can go a long way in providing key healthy fats along with hunger management. Other benefits are a dose of magnesium and fiber. Some nuts and seeds, such as walnuts and flax seeds, also contain omega-3 fatty acids.

పాలు, పాల పదార్ధాలు :
పాలు, పాలపదార్ధాలు ఎముకలు, పళ్ళ పుష్టికి దోహదం చేస్తాయి. కాల్షియం, విటమిన్ డి కలిగి వుంటాయి. కాని డయాబెటిక్ వారు మాత్రం వెన్న తీసిన పాలు, మజ్జిగ మాత్రమే వాడాలి

Fat-free Milk and Yogurt

Everyone knows dairy can help build strong bones and teeth. In addition to calcium, many fortified dairy products are a good source of vitamin D. More research is emerging on the connection between vitamin D and good health.

పండ్లు :

పుచ్ఛ, నారింజ, నిమ్మ, దబ్బ కాయలు, దోర జామకాయలు, స్టార్ ఫ్రూట్స్, నేరేడు పండ్లు, బొప్పాయి, యాపిల్ కాయలు కూడా మితంగా మాత్రమే తినాలి. చిన్న రేగిపండ్లు, ఉసరికాయలు, తినవచ్చు.

జామ:
మధుమేహం బారిన పడిన వాళ్లు తినగలిగే ఏకైక పండు ఇది. ఇందులో ఉండే ముడి ఫైబర్ కడుపు నిండేలా చేసి ఎక్కువ ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. బాగా పండిన జామకాయల్లో కంటే దోరగా పండిన వాటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది
ఆపిల్
మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉత్తమమైన పండుగా దీనిని పేర్కొనవచ్చు. తక్కువ గ్లైసిమిక్ విలువలతో పాటుగా, పెక్టిన్ ను సమృద్దిగా కలిగి ఉంటుంది. వీటిలో ఉండే కరిగే ఫైబర్ రక్తంలోని చక్కెరలను, కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు త్వరగా ఇన్ఫెక్షన్ లకు గురవుతుంటారు. ఆపిల్ లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ కారకాలు ఇన్ఫెక్షన్ లను దూరంగా ఉంచుతాయి.
పియర్స్
గ్లైసిమిక్ ఇండెక్స్ ను తక్కువగా కలిగి ఉండే పండ్లలో ఇవి కూడా ఒకటి. విటమిన్, మినరల్ లను మరియు ఫైబర్ లను అధికంగా కలిగి ఉండే బేరిపండు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించటమే కాకుండా, కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కావున మధుమేహులు తప్పక ఈ పండును తినాలి.
ద్రాక్షపండ్లు
ఆరోగ్యకర బరువు, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే మరియు మధుమేహా వ్యాధి గ్రస్తులకు చికిత్సలో ముఖ్యమైన సమ్మేళనంగా పేర్కొనే 'నారిన్జేనిన్' అనే సమ్మేళనం ద్రాక్ష పండులో ఉన్నాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉండే ఈ పండు రక్త ప్రసరణను మెరుగుపరచటం, కొవ్వు పదార్థాలను తగ్గించటం మరియు కేన్సర్ వ్యాధిని నివారించటం వంటి వాటిని చేస్తుంది.
ఆరెంజ్
నారింజ పండు అని గుర్తు రాగానే మొదట గుర్తొచ్చేది, విటమిన్ 'C'. అంతేకాదు, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ లు రక్తంలోని చక్కెర స్థాయిలను మరియు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. వీటితో పాటుగా విటమిన్ 'A', సంక్లిష్ట విటమిన్-'B' వంటి అనేక విటమిన్ లను కలిగి ఉంటుంది. ఇది మధుమేహులకు అన్ని రకాలుగా సహాయపడుతుంది

Fruits :

Atleast five servings of fruits are recommended daily, Most of the fruits are good for diabetics and do not raise blood glucose levels significantly, fruits also provide fibre which delays absorption of other foods Watermelon, melon, lime, orange may be consumed in unlimited quantities (Zero calory fruits), take peeled Guava, papaya, apple, Do not take more than 1 small banana in a day

బియ్యం :
పారాబాయిల్డ్ బియ్యం, పొడుగు బియ్యం, బాస్మతీ బియ్యం, ముడిబియ్యం, జల్లించని గోధుమ పిండి, చిరుధాన్యాలు నిదానంగా జీర్ణం అవుతాయి. అందువలన రక్తంలో గ్లూకోజ్ శాతం నెమ్మదిగా పెరుగుతుంది. పూర్తిగా పాలిష్ చేసిన బియ్యం తినరాదు.

Rice
జామ్స్, బట్టర్ లు తినరాదు
వీటిలో పంచదార ఎక్కువగాను మరియు నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు

BREADS

Avoid White breads & buns as they have high glycemic index , prefer brown bread or multiple or whole grain breads Roti small without applying butter is the most preferable- on average 2 small rotis/ chapattis are suited for one meal. Avoid Naan, ( If too eager take no more than ¼ of an average naan) do not spread butter, paratha ( take not more than 1 small paratha), Roomali roti
రాగులు:
రాగుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాకుండా రాగులను ఆహారంలో ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఎందుకంటే ఇందులో ఉండే సంక్లిష్ట ఫైబర్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి తొందరగా ఆకలివేయదు. ఫలితంగా గ్లూకోజ్ విడుదల తగ్గుతుంది.
గోధుమలు:
గోధుమల్లో ఉండే గ్లుటెనిన్ అనే ప్రోటీన్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా అధిక ఇన్సులిన్ విడుదలను క్రమబద్ధీకరిస్తుంది. ఓట్స్ : వీటిలో ప్రోటీన్ల్లు, ఫైబర్ సమ మోతాదులో ఉంటాయి. కొవ్వు శాతం తక్కువ. తొందరగా జీర్ణం కావు. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఇచ్చే ప్రొటీన్ డైట్లో ప్రతిరోజు కనీసం రెండు సార్లయినా ఓట్స్ ఏదో ఒక రూపంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
నీళ్లు:
సాధారణంగా మధుమేహంతో బాధపడుతున్నవారికి ఏదైనా గాయమైతే అంత త్వరగా మానడం కష్టం. నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఖనిజ లవణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి. అంతేకాకుండా రక్తంలోని మలినాలను బయటకు పంపుతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువ తాగడం మంచిది.
కూరగాయలు :
ఆకుపచ్చని ఆకుకూరలు అన్నీ తినవచ్చు. బీన్స్, చిక్కుళ్ళు, బీర, బెండ, దోస, కాకర, మునగ, టమాటో వంటివి తినవచ్చు. దుంపలు తినరాదు

VEGETABLES

Green leafy vegetables are highly recommended, legumes like beans are also recommended

చట్నీలు :
పుదీనా, కొతిమీర టమాటో చట్నీలు ఆరోగ్యకరం.

CHUTNIES

Chutnneys are preferable mint ( pudina), Kothimera, Tomato etc

చిరుతిండ్లు :
వేయించిన పదార్థాలు బిస్కట్లు, పేస్త్రీలు, చిప్ప్, జామ్స్, పిజ్జాలు తినరాదు. పకోడీలు, చక్రాలు కూడా నిషిద్ధం.నూనెలో వేయించిన పదార్ధాలు కూడా తినరాదు.

SNACKS

Fried snacks should be absolutely avoided, Biscuits, pastries with vegetable shortening, or hydrogenated vegetable oils should also be avoided. Prefer baked, roasted snacks without transfats or oils Bhune chane, murmure, Many varieties of roasted cereals are now available. Avoid matthi, samose, pakori, French fries

నూనెలు :
ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ సోయా నూనె వాడవచ్చు. వనస్పతి(డాల్డా) పూర్తిగా నిషిద్ధం. నెయ్యి, వెన్న

COOOKING OIL

Use oils rich in Monounsaturated Fatty acids like olive oil. Do not use, butter, animal lard, desi ghee ( clarified butter) Soya oil, Mixture of Sunflower with mustard oil; Do not use Transfats at all ( Vanaspathi ghee)