header

Korrala Salad

కొర్రల సలాడ్
కావలిసినవి :
కొర్రలు : 1 కప్పు
నువ్వులనూనె : 3 టీ స్పూన్లు
అనాసపువ్వు : ఒకటి
క్యాప్పికమ్ : ఎరుపు, పసుపు, ఆకుపచ్చవి - ఒక్కొక్కటి
క్వాలిఫ్లవర్ రెమ్మలు లేదా బ్రకోలి : 1 కప్పు
ఉప్పు : తగినంత
సోయాసాస్ : ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బల ముక్కలు : 1 టేబుల్ స్పూన్
ఉల్లికాడల తురుము : 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి : అరటీ స్పూన్

తయారు చేసే విధానం :
కొర్రలను పాన్లో వేసి సన్నని మంటమీద మంచివాసన వచ్చే దాకా వేయించాలి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నె లేక పాన్లో నాలుగు కప్పుల నీరు పోసి బాగా మరిగించాలి. తరువాత కొర్రలను పాన్లోవేసి పొయ్యి మీద పెట్టి మరిగించిన నీళ్ళను కొద్ది కొద్దిగా పోసి కొర్రలను ఉడికించుకోవాలి. బాణాలిలో 2 స్పూన్ల నూనెను వేసి కాగిన తరువాత అనాస పువ్వును వేసి వేయించాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలను, బ్రకోలీ లేదా క్యాలిఫవర్ ముక్కలు వేసి అవి కాస్త మెత్తబడేవరకు ఉడికించాలి. తరువాత తగినంత ఉప్పు సోయాసాస్, మిరియాలపొడి, ఉల్లికాడల ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన కొర్రలు కూడా వేసి బాగా కలిపి అందించాలి.