కావలసినవి :
శెనగపిండి : కప్పు
బియ్యపు పిండి : పావుకప్పు
గోధుమపిండి : ముప్పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు : అరకప్పు
మెంతికూర : అరకప్పు
పచ్చిమిర్చి : టీ స్పూను
జీలకర్ర : అరటీ స్పూను
ఉప్పు : తగినంత
నూనె : కొద్దిగా
ఓ గిన్నెలో అన్నీ వేసి బాగా కలపాలి.తరువాత సరిపడా గోరువెచ్చని నీరు పోసి చపాతీ పిండిలా కలిపి తడిబట్ట కప్పి అరగంటసేపు ఉంచాలి.
తరువాత పిండిని మెత్తగా పిసికి చిన్నచిన్న ఉండల్లాగా చేయాలి.
ఇప్పుడు ఒక్కోముద్దను చపాతీలాగా పలుచగా చేయాలి. దీన్ని వేడెక్కిన పెనం మీద నూనె వేయకుండా కాల్చుతూ రెండోవైపు కూడా తిప్పుతూ గోధుమరంగు మచ్చలు వచ్చేదాకా కాల్చి తీయాలి. ఇపుడు దీనిని నేరుగా స్టవ్ మంటమీద గోధుమరంగు రంగు మచ్చలు ముదురు రంగు వచ్చేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. ఏదైనా కూరతో కలిపి తినవచ్చు.