header

Ragi Utappam

రాగి ఊతప్పం
కావలిసినవి :
రాగిపిండి : 2 కప్పులు
జీలకర్ర : 1 టీస్పూను
పెరుగు : అరకప్పు
అల్లం తురుము : టేబుల్ స్పూను
పచ్చిమిర్చి : రెండు
ఉప్పు : తగినంత
టమాటో ముక్కలు : 1 కప్పు
ఉల్లికాడలు లేక క్యాప్సికమ్ ముక్కలు :1 కప్పు

తయారు చేసే విధానం
రాగిపిండిలో జీలకర్ర, పెరుగు, అల్లం తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ వేసి కలపాలి. తరువాత తగినంత నీరు పోసి దోసెల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెనంమీద ఊతప్పంలా వేసి దానిమీద కూరగాయల ముక్కలు వేసి రెండువైపులా కాల్చాలి.వీటిని ఏదైన చట్నీతో తినవచ్చు. ----ఈనాడు ఆదివారం అనుబంధం సౌజన్యంతో......