header

Cholestrol Reducing Food..కొలెస్ట్రాల్ పెరగకుండా

Cholestrol Reducing Food..కొలెస్ట్రాల్ పెరగకుండా


రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువుంటే………….
రాత్రి భోజనం తెల్ల అన్నం మాని వేసి రొట్టెలు తినడం అలవాటు చేసుకోండి.... గోధుమపిండిలో కొద్దిగా ఓట్స్ పిండి కూడా కలపండి. శరీరానికి పీచు అందుతుంది. లేదా కొలెస్ట్రాల్ సమస్య అదుపులోకి వచ్చేవరకూ కొన్నాళ్లు దంపుడు బియ్యాన్నే ఎంచుకోవడం మంచిది. అలాగే చక్కెరను పూర్తిగా తగ్గించి బదులుగా తేనె, బెల్లం పరిమితంగా వాడాలి .
బ్రెడ్ లలో సాధారణ బ్రెడ్ కన్నా... బ్రౌన్ బ్రెడ్ కానీ మల్టీ గ్రెయిన్ బ్రెడ్ కానీ మంచివి.
మంసాహారులైతే మటన్ కన్నా స్కిన్ లెస్ చికెన్, చేపల్ని వారంలో రెండుసార్లు తీసుకోవచ్చు. చేపల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి మేలు చేయడమే కాదు, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి.
సాయంత్రం ...చిరుతిళ్లలో బిస్కెట్లకు ... బదులుగా పెసల మొలకలూ, పండ్లూ, ఉడికించిన గింజల్ని తినడం అలవాటు చేసుకోవాలి.
కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తినటం మంచిది.
వెన్న తీసిన పాలనే వాడాలి. పొద్దుటిపూట టీ, కాఫీ తాగేవాళ్లు వాటికి బదులు గ్రీన్టీని అలవాటు చేసుకుంటే ....కొలెస్ట్రాల్ సమస్య చాలా తక్కువ సమయంలో అదుపులోకిరావచ్చు. వీటికి తోడు డాక్టర్లు సూచించిన మందులు కూడా తప్పనిసరిగా వాడాలి.