header

Fat Reducing Food…బరువు తగ్గించే ఆహారపదార్ధాలు...

Fat Reducing Food…బరువు తగ్గించే ఆహారపదార్ధాలు...


అధికంగా పీచుపదార్థాలు ఉండే ఆహారం తీసుకోవాలి.
సాధారణంగా చాలామంది పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి అల్పాహారం తినడం మానేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వలన జీవక్రియ రేటు తగ్గిపోయి అనుకున్న లక్ష్యం చేరుకోలేము. ఇలా కాకుండా పీచుపదార్థాలు అధికముగా ఉండే ఆకుకూర సలాడ్ లు, ఓట్స్ మొదలైనవి తీసుకుంటే, అవి పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వు కణాలను తగ్గేట్టు చేస్తుంది.
ముఖ్యంగా రెండుపూటలా తెల్ల అన్నం (పాలిష్ డ్ రైస్ )తినేవారు కనీసం ఒకపూట ఐనా తెల్ల అన్నం(పాలిష్ డ్ రైస్ ) మానివేసి ముడిబియ్యం కానీ గోధుమ పిండి చపాతీలు తినటం అలవాటు చేసుకోవాలి. కండలను పెంచుతూ బరువు తగ్గాలనుకుంటే కనుక, మీ ఆహారానికి గుడ్డు తెల్ల సొనను జత చేర్చండి. గుడ్డు తెల్ల సోనలో కేవలం ప్రొటీన్లు మాత్రమే ఉన్నందున అది కొవ్వును కరిగించి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. రోజులో కనీసం రెండుసార్లు గుడ్డు తెల్ల సొనను తీసుకుంటే కొవ్వు త్వరగా తగ్గుతుంది.
ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం కలిపిన నీళ్లను తాగండి:
చాలా పరిశోధనలలో తేలినదేమిటంటే నీటికి కొన్ని నిమ్మకాయ ముక్కలను కలపడం వలన పొట్టలో కొవ్వు తగ్గుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ-ఆక్సిడెంట్ లు పొట్టగోడకు అంటుకుని ఉన్న కొవ్వు కణాలను శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది.
పిండిపదార్ధాలను తక్కువగా తీసుకోండి:
ఉదర భాగం వద్ద కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే, మీ ఆహారంలో నుండి పిండిపదార్ధాలను మినహాయించండి. వైట్ బ్రేడ్, తెల్లని వరి అన్నం,పంచదార, పాస్తా, పిజ్జా, బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు మొదలైన వాటిలో అనారోగ్యకరమైన పిండిపదార్ధాలు ఉంటాయి కనుక వాటిని తినరాదు. ఇలా చేస్తే పొట్టలో కొవ్వు తగ్గుతుంది.
మాంసాహారులైతే మటన్ కు బదులు స్కిన్ లెస్ చికెన్, చేపలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.