header

Fati Liver Reducing Food…కాలేయవాపు వ్యాది నివారణకై తీసుకోవలసిన సహజమైన ఆహారపదార్ధాలు

Fati Liver Reducing Food…కాలేయవాపు వ్యాది నివారణకై తీసుకోవలసిన సహజమైన ఆహారపదార్ధాలు"


చిరుధాన్యాలు, ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ వంటి ఆహార పదార్ధాలు ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు మరియు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండే పోషకాలు, ఫైబర్ తో నిండి ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి వివిధ తీవ్రమైన పరిస్థితుల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
ఈ ఆహార పదార్ధాలకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనగా ఆహారం తిన్న తరువాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సూచించే పద్ధతి. ఈ క్రింది ఆహారపదార్ధాలు తక్కువ గ్లైసిమిక్స్ ను కలిగి ఉంటాయి
కాఫీ
కాఫీ కాలేయ వాపు వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. కాఫీ తీసుకున్న వారికంటే, తీసుకోని వారిలోనే ఈ కాలేయ వాపు వ్యాధి పెరిగే అవకాశo ఎక్కువగా ఉన్నట్లు పరీక్షలలో తేలింది. కాఫీ, కాలేయ వాపు వ్యాధికి దోహదం చేసే ఎంజైముల సంఖ్యని తగ్గించడం మూలంగా ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. కానీ కాఫీని మితంగా తీసుకోవాలి
కూరగాయలు
బ్రోకోలీ, పాలకూర, కాలే(ఆకుకూరలో రకం), టమోటాలు, మరియు కాప్సికం వంటి కూరగాయలను తరచూ తినడం మూలంగా శరీరానికి కాలేయానికి అవసరమైన పోషకాలు అందించబడతాయి. అమెరికన్ లివర్ ఫౌండేషన్ నివేదిక, కాలేయ వాపు వ్యాధి నివారణకు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోనవలసినదిగా సూచిస్తుంది.
టోఫు
టోపు సోయా గింజల నుండి తయారుచేయబడుతుంది. టోఫు కాలేయంలో కొవ్వు శాతాన్ని తగ్గించే ఆహారం. ఇది కొవ్వు తక్కువగా కలిగి ఉండి, ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉంటుంది మరియు కాల్షియం, విటమిన్ ఎ, ఐరన్ మరియు మెగ్నీషియంల కలయిక. టోఫు తినడం కాలేయ వాపు వ్యాధి ప్రమాదాన్ని తగ్గుతుంది.
చేపలు
సాల్మన్, సార్డినెస్, ట్రౌట్ వంటి చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఈ ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి అవసరమైన మేర అందినప్పుడు కాలేయ వాపు క్రమంగా తగ్గడం మొదలవుతుంది. పండ్లు :
వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో పండ్లు ముందుంటాయి. ముఖ్యంగా నారింజ, బొప్పాయి, బ్లూబెర్రీస్, చెర్రీస్, రాస్ప్బెర్రీస్ మరియు అవకాడో వంటి పండ్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి, తద్వారా కాలేయ వాపు తీవ్రతని తగ్గించుటలో అవకాడో దోహదం చేస్తుంది. గ్రీన్ టీ
గ్రీన్ టీ ప్రధానంగా కొవ్వును కరిగించుటలో సహాయం చేస్తుంది. ఎక్కువమంది దీని రుచి కారణంగా తాగరు. కాని కాలేయ పనితీరును మెరుగుపరుచుకోవటానికి కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గించుటలో గ్రీన్ టీ సహాయపడగలదని పరిశోధకులు తేల్చారు. ఉదయాన్నే టీకి బదులు గ్రీన్ టీ అలవాటు చేసుకుంటే మంచిది
ఆలివ్ ఆయిల్
ఆలివ్ నూనె అధికమోతాదులో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఆలివ్ నూనె కాలేయ వాపు కారకులైన ఎంజైములు స్థాయిని తగ్గిస్తుంది బరువును నియంత్రించటం వలన కాలేయ వాపు వ్యాధిని నివారించవచ్చని పరిశోధనలో తేలింది.
పొద్దుతిరుగుడు విత్తనాలు
విటమిన్ E కాలేయాన్ని కాపాడగల వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. విటమిన్ ఇ పొద్దుతిరుగుడు విత్తనాలలో అధికంగా ఉంటుంది. అంతేకాకుండా గుండె, మెదడు ఆరోగ్యాన్ని పెంచే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా విటమిన్ ఇ లోఉంటాయి.