header

Food for Thyroid Patients… థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచే ఆహారపదార్ధాలు...

Food for Thyroid Patients…థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచే ఆహారపదార్ధాలు...


అయోడిన్.
థైరాయిడ్ సమస్య రావడానికి ప్రధాన కారణం అయోడిన్ లోపం. అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అయోడిన్ ఉప్పును వాడాలి. దీంతోపాటు సముద్రపు చేపలు, రొయ్యలు, ఆలుగడ్డలు, అరటిపండ్లలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది.
అల్లం
థైరాయిడ్ సమస్య ఉన్న వారు అల్లంను తరచుగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం తేనెతో సేవిస్తే థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. అవిసె గింజలు
వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తాయి. థైరాక్సిన్ తగినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా పని చేస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. అవిసె గింజలను లేదా పొడిని ఏదో ఒక రూపంలో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. వాల్నట్స్
వాల్నట్స్ లో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. అది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో థైరాక్సిన్ అవసరం ఉన్నంత మేర శరీరానికి అంది థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినూనె
ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలను క్రమబద్దీకరిస్తాయి. దీంతో థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా సమస్య నుంచి బయట పడవచ్చు బి విటమిన్
థైరాయిడ్ గ్రంథి పనితీరును బి విటమిన్స్ ప్రభావితం చేస్తాయి. కనుక బి విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు అశ్వగంధ
అశ్వగంధ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది.