header

I T I Courses... Guidelines to Students

ఐటీఐ
ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)ని ఎంచుకోవడం ద్వారా విద్యార్థి పదోతరగతి తర్వాత ఒకటి, రెండేళ్ల కాలవ్యవధిలో సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. అదీ అతి తక్కువ వ్యయంతోనే. దీనివల్ల చిన్న వయసులోనే ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే సాంకేతిక విద్యారంగంలోనే ఉన్నత స్థాయి కోర్సులూ చేయవచ్చు. టెన్త్ తర్వాత ఒకటి రెండేళ్ల పాటు కష్టపడి ఐటీఐ కోర్సులు చేస్తే, మంచి ఉపాధి అవకాశాలు ముంగిట్లో ఉంటాయి. ఏ కోర్సు చేయాలో తెలివిగా ఎంచుకోవడమే విద్యార్థుల వంతు.
కేంద్రప్రభుత్వ కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఐటీఐలను ప్రారంభించింది. నిరుద్యోగితను తగ్గించడం, మానవ వనరుల నైపుణ్యాలను పెంచి పరిశ్రమకు అందించడం దీని లక్ష్యాలు. క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీం (సీటీఎస్) కింద 1950లో ఐటీఐలను స్థాపించింది. 14-40 ఏళ్ల మధ్య వయస్కులు ఐటీఐల్లో శిక్షణ పొందడానికి అర్హులు. ఎక్కువ భాగం ట్రేడ్లలో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థికి కేంద్ర ప్రభుత్వ శ్రామిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్ (ఎన్.సి.వి.టి.) సర్టిఫికెట్ అందిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉపాధి కల్పనలో ఈ సర్టిఫికెట్ ఉన్న విద్యార్థులకే ప్రాధాన్యమిస్తాయి.
సాంకేతిక నైపుణ్యాన్ని సాధించాలనుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఐటీఐలవైపే మొగ్గు చూపుతారు. ప్రస్తుతం ఆధునిక పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. దీంతో బహుముఖ నైపుణ్యాలను పెంచుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది. ఏడాది, రెండేళ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సులు (ట్రేడ్లు) పూర్తి చేస్తే స్వయం ఉపాధికి ఢోకా ఉండదు. కొన్ని రకాల కోర్సులకు వందశాతం ఉపాధి అవకాశాలు ఉండగా, మరి కొన్ని కోర్సుల వల్ల వచ్చే ఉద్యోగాలకు సీజనల్‌గా గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో 138 ఐటీఐలు (ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి), 600 పైగా ఐటీసీలు (ప్రైవేటు రంగంలోనివి) ఉన్నాయి.
ట్రేడ్ ల వివరాలు
ఐటీఐల్లో ఇంజినీరింగ్ కోర్సులు (ట్రేడ్లు) రెండేళ్లు, ఏడాది
నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్లు ఏడాది, ఆరునెలల కాలపరిమితితో ఉన్నాయి. వాటి వివరాలు..
ఇంజినీరింగ్ (రెండేళ్ల కాలవ్యవధి):
అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్), డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టం, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టం మెయిన్‌టెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్)
రేడియో-టీవీ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), మెయిన్‌టెనెన్స్ మెకానిక్ మిషన్ టూల్, మెరైన్ ఫిట్టర్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, వెజల్ నావిగేటర్, వైర్‌మన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్), మెకానిక్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్.
ఇంజినీరింగ్ (ఏడాది) ట్రేడ్లు:
పెయింటర్ (జనరల్), మెకానిక్ (డీజిల్), మౌల్డర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, శానిటరీ హార్డ్‌వేర్ ఫిట్టర్, సైంటిఫిక్ గ్లాస్ అండ్ నియాన్ సైన్స్, షీట్‌మెటల్ వర్కర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్)
నాన్ ఇంజినీరింగ్ (ఏడాది) ట్రేడ్లు:
బుక్‌బైండింగ్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కటింగ్ అండ్ స్యూయింగ్, డ్రెస్‌మేకింగ్, హార్టికల్చర్, లిథో- ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్, మాసన్, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్, ప్లంబర్, ప్రి ప్రిపరేటరీ స్కూల్ మేనేజ్‌మెంట్ (అసిస్టెంట్), స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్), వెల్డింగ్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్). నాన్ఇంజినీరింగ్ 6 నెలల ట్రేడ్లు:
డ్రైవర్ కమ్ మెకానిక్ (ఎల్ఎంవీ), హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్.
సీఓఈ ట్రేడ్లు:
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొడక్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, ఆటోమొబైల్స్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, లెదర్, అపెరల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్, ఫ్యాబ్రికేషన్ (ఫిట్టింగ్, వెల్డింగ్), ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ మెషినరీ, కన్‌స్ట్రక్షన్ ఉడ్ వర్కింగ్, ప్రాసెస్ ప్లాంట్ మెయిన్‌టెనెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టూరిజం, బ్యాంబూ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, టెక్స్‌టైల్ టెక్నాలజీ.
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎలాంటి రుసుమూ లేకుండా ప్రభుత్వం ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణనిస్తోంది. ప్రైవేటుగా (ఐటీసీల్లో అయితే) ఫీజులు వసూలు చేస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఉంటుంది.
ఐటీఐలకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. పదేళ్ల కిందట ఏటా 10 వేల మంది విద్యార్థులు ఐఐటీల్లో చేరేవాళ్లు. ప్రస్తుతం ఏటా సుమారు లక్షమంది విద్యార్థులు చేరుతున్నారని అంచనా. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు కనీసం రూ.5000 నుంచి రూ.8000 వరకు నెలవారీ వేతనాలతో ఉపాధి పొందడానికి అవకాశాలు ఇప్పుడు బాగా ఉన్నాయి.
దరఖాస్తు చేయటం ఎలా
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐ ట్రేడ్‌లో చేరాలనుకుంటే సమీపంలోని ఐటీఐకి వెళ్లి ప్రిన్సిపాల్‌ను నేరుగా సంప్రదించవచ్చ
* విద్యార్థులు తమ జిల్లాలోని ప్రిన్సిపాల్ లేదా కన్వీనర్ ద్వారా నేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
* జిల్లాలో ఉండే ప్రభుత్వ ఐటీఐ లేదా ఎన్‌సీవీటీ పరిధిలోని ఐటీసీ (ప్రైవేటు ఐటీసీ)ల్లో ప్రవేశానికి ఒకే దరఖాస్తు సరిపోతుంది.
రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ ఒక ఐటీఐ ప్రిన్సిపల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పూర్తి చేసిన దరఖాస్తును కన్వీనర్ కార్యాలయాల్లోనే అందించాలి.
కన్వీనర్ ల వివరాలు
1. శ్రీకాకుళం: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్) ఎచ్చెర్ల, శ్రీకాకుళం
2. విజయనగరం: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్), విజయ నగరం
3. విశాఖపట్నం: ప్రిన్సిపాల్, ఐటీఐ (ఓల్డ్) విశాఖపట్నం
4. తూర్పుగోదావరి: ప్రిన్సిపాల్, ఐటీఐ, కాకినాడ
5. పశ్చిమగోదావరి: ప్రిన్సిపాల్, ఐటీఐ, ఏలూరు
6. కృష్ణాజిల్లా: ప్రిన్సిపాల్, ఐటీఐ, విజయవాడ
7. గుంటూరు: ప్రిన్సిపాల్, ఐటీఐ, తెనాలి
8. ప్రకాశం: ప్రిన్సిపాల్, ఐటీఐ (బాయ్స్), ఒంగోలు
9. నెల్లూరు: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్), నెల్లూరు
10. అనంతపురం: ప్రిన్సిపాల్, ఐటీఐ (బాయ్స్), అనంతపురం
11. చిత్తూరు: ప్రిన్సిపాల్, ఐటీఐ, తిరుపతి
12. కడప: ప్రిన్సిపాల్, ఐటీఐ, కడప
13. కర్నూలు: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్), కర్నూలు
14. ఖమ్మం: ప్రిన్సిపాల్, ఐటీఐ, కొత్తగూడెం
15. కరీంనగర్: ప్రిన్సిపాల్, ఐటీఐ, పెద్దపల్లి
16. ఆదిలాబాద్: ప్రిన్సిపాల్, ఐటీఐ, మంచిర్యాల
17. నిజామాబాద్: ప్రిన్సిపాల్, ఐటీఐ (బాయ్స్) నిజామాబాద్
18. వరంగల్: ప్రిన్సిపాల్, ఐటీఐ (బాయ్స్), వరంగల్
19. నల్గొండ: ప్రిన్సిపాల్, ఐటీఐ, భువనగిరి
20. మహబూబ్‌నగర్: అసిస్టెంట్ డైరెక్టర్, డీఎల్‌టీసీ/ ఐటీఐ, మహబూబ్‌నగర్
21. మెదక్: ప్రిన్సిపాల్, ఐటీఐ, పటాన్‌చెరు
22. రంగారెడ్డి: ప్రిన్సిపాల్, ఐటీఐ, మేడ్చెల్
23. హైదరాబాద్: ప్రిన్సిపాల్, ఐటీఐ, సికింద్రాబాద్.
ఉద్యోగాలు
పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.
ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. స్థిరమైన జీవితం ఏర్పరుచుకోవడానికి చిన్న వయసులోనే తొలి అడుగులు వేయవచ్చు.
పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో ఏర్పడే క్లరికల్, ఆఫీసర్ తదితర హోదా పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. టెన్త్, ఇంటర్, ఆపై అర్హతలకు తగినవిధంగా నియామక ప్రకటనలు జారీ చేస్తోంది. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వే మొదలైన విభాగాలు వివిధ రకాల పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, అటవీ శాఖలో ఏర్పడే ఖాళీలను ఆ శాఖ భర్తీ చేస్తోంది. వీటి గురించి తెలుసుకుందాం.