header

Vocational Courses

వృత్తి విద్యాకోర్సులు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలను కల్పించింది. వాటి వివరాలు..
* రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసినవారు ఎంసెట్‌కు కూడా హాజరు కావచ్చు. దీని కోసం నిర్దేశించిన బ్రిడ్జికోర్సు పూర్తి చేయాలి.
* ఒకవేళ డిగ్రీ చదవాలనుకుంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులతో సమానంగా ఆర్ట్స్, కామర్స్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. బ్రిడ్జి కోర్సు చేయడం ద్వారా బీఎస్సీలోనూ చేరవచ్చు.
* ప్రైవేటు కళాశాలలో వృత్తి విద్యా కోర్సు చేసే ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వం బోధనారుసుం కింద రూ.4,500 చెల్లిస్తోంది.
* సాధారణ ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు వృత్తి విద్యా కోర్సు చేసేవారికీ ఉపకారవేతనాలు అందుతాయి. 'ప్రతిభ అవార్డులకూ వీళ్లు అర్హులే.
* వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చు. ఇందుకు ఎలాంటి ప్రవేశపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా కూడా పాలిటెక్నిక్ చేయవచ్చు. అప్పుడు కూడా రెండో సంవత్సరం నుంచే చదవవచ్చు.
* దీర్ఘకాలిక కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సమయంలో విద్యార్థికి ప్రతినెలా స్టయిపెండ్ కింద కొంత నగదు లభిస్తుంది (కొన్ని కంపెనీలు మార్కెట్ డిమాండ్‌ను బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకూ చెల్లిస్తున్నాయి).
చేరడమెలా?
టెన్త్ ఫలితాలు వెలువడిన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు దీర్ఘ కాలిక (రెండేళ్ల) వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తుంది. విద్యార్థులు నేరుగా జూనియర్ కళాశాలలను సంప్రదించవచ్చు. ప్రవేశాల ప్రక్రియ జులై 15 వరకూ కొనసాగుతుంది. ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం రూ.800 ఫీజు చెల్లించాలి. రెండో సంవత్సరం రూ.590 చెల్లించాల్సి ఉంటుంది.
'మేళా'ల్లో వేలాది మందికి ఉపాధి:
ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏటా జాబ్ మేళాలు, అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ వేలాది మందికి వీటి ద్వారా ప్రయోజనం చేకూరింది. వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థికి కనీసం రూ.6000 నుంచి రూ.10,000 వేతనంతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు కొనసాగుతున్నాయి.
మౌలిక వసతుల కల్పన
వృత్తివిద్యాకోర్సులు విజయవంతం కావాలంటే మౌలికవసతులు, అధ్యాపకులు, శిక్షణ పద్ధతులు నాణ్యమైనవిగా ఉండాలి. ఈ మూడు అంశాలపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరింత దృష్టి సారించింది. లేబొరేటరీల ఆధునికీకరణకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ పెద్ద పీట వేస్తోంది. ప్రాక్టికల్స్ నిర్వహణ పటిష్టంగా ఉండేందుకు సమీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి - ఉన్నత విద్య - ఉపాధితోపాటు ఉన్నతవిద్య... ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలనుకున్నా అందుకు చక్కగా సరిపోయేవి ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులు. ప్రభుత్వం ఈ ప్రయోజనాలన్నిటినీ క్రోడీకరించి రూపొందించిన కోర్సులివి. టెన్త్ తర్వాత రెండేళ్లు వృత్తి విద్యకు కేటాయించడం ద్వారా త్వరగా ఉపాధి సంపాదించుకోవచ్చు. పాక్షికంగా ఉపాధి పొందుతూ ఉన్నత విద్యాభ్యాసం చేయవచ్చు. టెన్త్ తర్వాత రెండేళ్లకే ఒక సాంకేతిక విద్యానిపుణుడిగా తయారయ్యే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ కోర్సుల్లో చేరితే పెరుగుతున్న సాంకేతిక అవసరాలను ఉపాధికి అనుకూలంగా మలచుకునే అవకాశముంది.
అనంతరం ఉండే ఉపాధి అవకాశాలు
* బిజినెస్: షాపింగ్‌మాల్ సూపర్‌వైజర్, మార్కెటింగ్, రిసెర్చ్ అసిస్టెంట్, సేల్స్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్అసిస్టెంట్, జూనియర్అకౌంటెంట్.
* హెల్త్ అండ్ పారా మెడికల్: ఎ.ఎన్.ఎం.; ల్యాబ్ అసిస్టెంట్, సబ్ అసిస్టెంట్; డెంటల్ టెక్నీషియన్; డెంటల్ హైజీనిస్ట్; ఆప్తాల్మిక్ టెక్నీషియన్.
* హోంసైన్స్: గ్రామ సేవకులు, టైలరింగ్, ఇన్‌స్ట్రక్టర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, శారీ డిజైనర్, బాల్వాడీలు, అంగన్‌వాడీ టీచర్లు, క్రెష్ అసిస్టెంట్లు, ప్రీస్కూల్ టీచర్లు, క్యాటరింగ్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, స్టివార్డ్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్ అసిస్టెంట్.
* ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ: మెకానిక్స్ గ్రేడ్-1, మెకానిక్స్ గ్రేడ్-3, ఫిట్టర్ గ్రేడ్-1, టూవీలర్ మెకానిక్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్; వర్క్ ఇన్‌స్పెక్టర్, సివిల్ వర్క్ అసిస్టెంట్; స్కిల్డ్ క్లాస్-2, ట్రేడ్‌మెన్ గ్రేడ్-1, సివరేజ్ అండ్ శానిటరీ అసిస్టెంట్, సివిల్ సూపర్‌వైజర్, వర్క్ ఇన్‌స్పెక్టర్; రేడియో/టీవీ/ ఎలక్ట్రానిక్ మెకానిక్; ఎలక్ట్రీషియన్, జూనియర్ లైన్‌మేన్, డొమెస్టిక్ వైర్‌మేన్, డొమెస్టిక్ అప్లయెన్సెస్ మెకానిక్; జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ రిసెప్షనిస్ట్, బిల్లింగ్ క్లర్క్స్ (ఇ-సేవ కేంద్రాల్లో), వెబ్‌డిజైనర్.
* అగ్రికల్చర్: విలేజ్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్, సబ్ అసిస్టెంట్ ఇన్ అగ్రికల్చర్, వీడీఓలు; డెయిరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్; ఫిషరీస్ అసిస్టెంట్, ప్రాన్స్ కల్చర్, ఆక్వా కల్చర్; సెరికల్చర్ అసిస్టెంట్, ఫోర్‌మేన్ ఇన్ సెరికల్చర్.
* హ్యుమానిటీస్: టూరిస్ట్ గైడ్, టూరిజం అసిస్టెంట్, ట్రావెల్ ఖీ టికెటింగ్ ఏజెంట్స్, టూర్ ఆర్గనైజర్స్.
రెండేళ్ళ వొకేషనల్ కోర్సులు
* అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్: పట్టుపరిశ్రమ (సెరికల్చర్), క్రాప్‌ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, డైరీయింగ్, ఫిషరీస్.
* బిజినెస్ అండ్ కామర్స్ : మార్కెటింగ్ అండ్ సేల్స్‌మేన్‌షిప్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, అకౌంట్స్ అండ్ టాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్.
* హ్యుమానిటీస్ అండ్ అదర్స్ : టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్.
* ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, రూరల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, వాటర్‌సప్త్లె అండ్ శానిటరీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ.
* హెల్త్ అండ్ పారామెడికల్: మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎం.ఎల్.టి.), మల్టిపర్పస్ హెల్త్ వర్కర్ (ఫీమేల్), ఫిజియోథెరపీ, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్.
* హోంసైన్స్ : కమర్షియల్ గార్మెంట్ అండ్ డిజైన్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్, హోటల్ ఆపరేషన్.