header

Distance Education…ఇంటర్‌ తరువాత..... దూరవిద్య

Distance Education…ఇంటర్‌ తరువాత..... దూరవిద్య (డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌) ద్వారా చదవాలనుకునే వారికి...
ముందుగా దూరవిద్య ద్వారా చదవాలనుకునే విద్యార్థులు తప్పని సరిగా గమనించవలసిన విషయం:
దూర విద్య ద్వారా చదవడం అంటే యూనివర్సిటీలు పోస్టు ద్వారా స్టడీ మెటీరియల్‌ను పంపడం, పరీక్షల సమయంలో ప్రాక్టికల్స్‌, క్లాసులు నిర్వహించటం, రేడియో, టి.వి., కంప్యూటర్‌ వంటి సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత విద్యార్థులకు తగిన సలహాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయడం మొదలైంది. ఇప్పుడు శాటిలైట్ ద్వారా శిక్షణ ఇవ్వడం ఈ విధానంలో మరికొంత మందడుగు, ఆధునిక సౌకర్యాలను యూనివర్సిటీలు స్టడీ సెంటర్లలో కల్పిస్తూ విద్యార్థులకు నిరంతరం తమ సేవలు అందుబాటులో ఉంచేందుకు వర్సీటీలు కృషి చేస్తున్నాయి.
డి.ఇ.సి గుర్తింపు : దేశంలోని దూర విద్యావిధానంలో లభించే కోర్సులకు న్యూఢిల్లీలోని డిస్టెన్స్‌ ఎడ్యుకేషనల్‌ కౌన్సిల్‌ (డి.ఇ.సి) గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. అలాగే కోర్సులు నిర్వహిస్తున్న యూనివర్సిటీకి న్యూ ఢిల్లీలోని డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ కమిషన్‌ (యూ.జి.సి) అనుమతి ఉండాలి. దీనికి సంబందించి యూ.జి.జి వెబ్‌సైట్ లో గుర్తింపు వర్సిటీల జాబితాను పరిశీలించడం అవసరం. ఒకవేళ యూ.జీ.సీ గుర్తింపు లేకపోతే ఆ సంస్థలు అందించే దూరవిద్యా కోర్సుల సర్టిఫికెట్లకు గుర్తింపు ఉండదు. దీనివల్ల పడిన శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. ఈ సర్టిఫికెట్లు ఉద్యోగ నియామకాల్లోగాని ఉన్నత విద్య కోసం పరిగణనలోని తిసుకోరు. కాబట్టి అభ్యర్ధులు యూనివర్సిటీ వివరాలను అది అందించే కోర్సులను ప్రవేశానికి ముందే పరిశీలించడం అవసరం.

ఆంధ్రా యూనివర్సిటి - వైజాగ్‌

ఇంటర్‌ అర్హతతో ఈ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు : బి.ఏ. …..బి.కాం
కంప్యూటర్‌ సర్టిఫికెట్ కోర్సులు
ఆఫీస్‌ ఆటోమేషన్‌ అండ్‌ అకౌంటింగ్‌
ఆఫీస్‌ ఆలోమేషన్‌ అండ్‌ మల్టీమీడియా టెక్నాలజీస్‌
ఆఫీస్‌ ఆటోమేషన్‌ అండ్‌ ఇంటర్నెట్ టెక్నాలజీస్‌
ప్రవేశ ప్రకటనలు విద్యా సంవత్సరం ప్రారంభంలో వెలువడుతాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.andhrauniversity.info

అంబేద్కర్‌ వర్సిటీ

కోర్సులు - ఇంటర్‌ అర్హతతో ప్రధానంగా డిగ్రీ కోర్సులను అందిస్తుంది.
బి.ఏ. …. బి.కాం…..బి.ఎస్సీ
వీటితో పాటు డిగ్రీ అర్హతతో పీజీ ప్రోగ్రాములు, పిజీ డిప్లోమాలు, టీచర్‌గా సర్విస్‌లో ఉన్న వారికి బి.ఇ.డి. మొదలైన కోర్సులను అందిస్తోంది.ఈ వర్సిటీకి రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాల్లో జల్లా కేంద్రాలలో అధ్యయన కేంద్రాలున్నాయి.
ప్రవేశం : విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటనలు వెలువడుతుంటాయి.
చిరునామా
డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సి,
ప్రొ.రామ్‌ రెడ్డి మార్గ్‌,
రోడ్‌ నె.46, జూబ్లి హిల్స్‌,
హైదరాబాద్‌ - 500 033.
ఇగ్నో : దూరవిద్యా విధానంలో ఇగ్నో దేశవ్యాప్తంగా విలువైన కోర్సులను అందిస్తోంది. ఇంటర్ విద్యార్ధులకు డిగ్రీ డిప్లోమో మరి కొన్ని ఇతర కోర్సులు
కొన్ని ప్రధాన డిగ్రీ ప్రోగ్రాములు :
బి.ఏ (జనరల్‌),
బి.ఏ ఇన్‌ ఇంటర్నేషనల్‌ హాస్పటాలటి అడ్మినిస్ట్రేషన్‌.
బి.ఎ.స్సీ నర్సింగ్‌ (పోస్ట్‌ బేసిక్‌)
బి.ఎస్సీ (ఆనర్స్‌) (ఆప్టోమెట్రి & ఆప్తాల్‌మిక్‌ టెక్నిక్స్‌).
బి.ఎస్సీ ఇన్‌ హాస్పటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌.
బిఎస్సీ - మెడికల్‌ ల్యాబెరేటరీ టెక్నాలజి, అనెస్తీషియా
అండ్‌ క్రికల్‌ కేర్‌ టెక్నాలజీ,
మెడికల్‌ రికార్డ్స్‌ అండ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ,
రేడియేషన్‌ థెరపీ టెక్నాలజీ, మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ
బి.కాం (మేజర్‌ సబ్జెక్టులు - అకౌంటెన్సీ, ఫైనాన్స్‌)
బి.కాం (మేజర్‌ సబ్జెక్టులు : కార్పోరేట్ అఫైర్స్‌, అడ్మినిస్ట్రేషన్‌)
బి.కాం: (ఫైనాన్సియల్‌ అండ్‌ కాస్ట్‌ అకౌంటింగ్‌)
బీబీఎ ఇన్‌ రిటెయిలింగ్‌ (డిప్లోమా ఇన్‌ రిటెయిలింగ్‌
అడ్వాన్స్‌డ్‌ డిప్లోమా ఇన్‌ రిటెయిలింగ్‌ బీబీఏ ఇన్‌ రిటెయిలింగ్‌
బి.టెక్‌ సివిల్‌ (కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్)
బి.టెక్‌ సివిల్‌ (వాటర్‌ రిసోర్స్‌ ఇంజనీరింగ్‌)
బీ.ఆర్క్‌
బీ.ఎల్‌.ఐ.ఎస్‌.సి
బీ.సి.ఏ
బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌
బి.ఏ. ఇన్‌ 3డీ యూనిమేషన్‌ అండ్‌ విజువల్‌ అఫెక్ట్స్‌
బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ మర్చెండైజింగ్‌
(పెరల్‌ అకాడమీ సహకారంతో)
బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ డిజైన్‌ (పెరల్‌ అకాడెమీ సహకారంతో)
బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ అపెరల్‌ డిజైన్‌ అండ్‌ మర్చెండైజింగ్‌
బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ కమ్యునికేషన్‌

డిప్లోమా కోర్సులు:

క్రియేటివ్ రైటింగ్ ఇన్‌ ఇంగ్లీష్‌, ఉర్దూ, ఎర్లీ ఛైల్డ్‌హుడ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, డిప్లోమా ఇన్‌ మేనేజ్ మెంట్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫిష్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ, టూరిజం స్టడీస్‌, హెచ్‌ఐవి అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, ఫైర్‌ సేఫ్టీ, బిజినెస్‌ ప్రొసెస్‌ అవుట్ సోర్సింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, అక్యాకల్చర్‌, పారాలీగల్‌ ప్రాక్టీస్‌, కంప్యూటర్‌ ఇంటిగ్రేటెడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్ మొదలైనవి. ఈ వర్సిటీ అధ్యయన కేంద్రాలు మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రవేశం : సంవత్సరంలో జులై జనవరి మాసాలలో అడ్మిషన్లకు ప్రకటనలు వెలువడుతుంటాయి. జులై సెషన్‌కు ధరఖాస్తులను ఏప్రిల్‌ చివరిలోగా జనవరి సెషన్‌కు అక్టోబరు లోగా ధరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
ఇగ్నో వెబ్‌సైట్ : www.ignou.ac.in

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సి

ఇంటర్‌ అర్హత ఆధారంగా చేరదగిన కోర్సుల వివరాలు
బి.ఏ, బి.కాం. బీ.ఎస్సీ
డిప్లోమా ఇన్‌ ప్రైమరీ ఎడ్యుకేషన్‌
డిప్లోమా ఇన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యునికేషన్స్‌
ప్రవేశ ప్రకటనలు విద్యా సంవత్సరం ప్రారంభంలో వెలువడుతాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.mannu.ac.in

ఉస్మానియా యూనివర్సి

హైదరాబాద్‌లో 1918లో ఏర్పాటు చేయబడినది. ఇంటర్‌ అర్హతతో కొన్ని ప్రధాన డిగ్రీ కోర్సులు
బి.ఏ. ……బి.ఏ (లాంగ్వేజెస్‌) ……బి.కాం.
బి.ఏ మ్యాధమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌
బ్యాన్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌
మాడ్యులర్‌ సర్టిఫికెట్ కోర్సులు.
వీటితో పాటు డిగ్రీ ఆపైన అర్హతలున్న వారికి పీజీ డిప్లోమా తదితర కోర్సులున్నాయి.
ప్రవేశ ప్రకటనలు విద్యా సంవత్సరం ప్రారంభంలో వెలువడుతాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.osmania.ac.in

రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలు

ఆచార్య నాగార్జునా యూనివర్సిటి, గుంటూరు
www.nagarjunauniversity.ac.in
కాకతీయ యూనివర్సి, వరంగల్‌
www.sdlceku.co.in
శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటి అనంతపురం
www.skuniversity.org
శ్రీ పద్మావతి మహిళావిశ్వవిద్యాలయం, తిరుపతి
www.padmavati-univ.org
జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటి, హైదరాబాద్‌
www.jntuh.ac.in

ఇతర రాష్ట్రాలలోని యూనివర్సిటీలు

అన్నామలై యూనివర్సిటి, హైదరాబాద్‌ www.annamalauniversity.ac.in
తమిళనాడు ఓపెన్‌ యూనివర్సిటి…….. www.tnou.ac.in
భారతీదాస్‌ యూనివర్సిటి…….. www.bdu.ac.in
మద్రాస్‌ యూనివర్సిటి ….. www.unom.ac.in
కర్నాటకా ఓపెన్‌ యూనివర్సిటి, www.karnatakaopenuniversity.co.in