
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఉప విభాగం ఏరోనాటికల్ ఇంజనీరింగ్, భూ వాతావరణంలో పయనించే విమానాలు (ఎయిర్ క్రాఫ్ట్స్) కు సంభంధించి శాస్త్రసాంకేతిక అంశాలను ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌గా చెప్పుకోవచ్చు.
విమానాలు, హెలికాప్టర్లు, సంబంధిత రంగాలలో కెరీర్ కోసం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చాలు. వాణిజ్య విమానాలు మొదలుకుని క్షిపణులు, యుద్ధ విమానాలు, స్పేస్ షటిల్స్, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ వెహికల్స్, హెలికాప్టర్లు, హోవర్‌క్రాఫ్ట్ డిజైన్, అమలు, పరిశోధన, నిర్మాణంలోనూ ఏరోనాటికల్ ఇంజనీర్ పాత్ర ఉంటుంది. ఏరోస్పేస్ ఇంజనీర్, ఏరోనాటికల్ ఇంజనీర్‌కు సంబంధించి వివిధ యూనివర్సిటీల కరికులమ్ ఒకేలా ఉంటుంది. అయితే, కొన్ని తేడాలు ఈ రెండు కోర్సులలో ఉన్నాయి, స్ట్రక్చరల్ డిజైన్, నేవిగేషనల్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ లేదా ప్రొడక్షన్ మెథడ్స్ లేదా ప్రత్యేకించి ఒక ప్రొడక్ట్ అంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ , ప్రయాణికుల విమానాలు, హెలికాప్టర్లు, ఉపగ్రహాలు, రాకెట్స్ వంటి వాటిలో స్పెషలైజేషన్ చేయవచ్చు.
ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను పక్కనపెడితే, ఎయిర్ ట్రావెల్ పెరిగిందన్నది నిజం. దాంతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ముందు వరుసలోకి వచ్చింది, సంబంధిత ప్రొఫెషనల్స్ అవసరమూ పెరిగింది. సాయిధ దళాలకు తోడు ప్రభుత్వ విభాలైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, రక్షణ మంత్రిత్వ శాఖ, పర్యావరణ విభాగం, రవాణా రీజియన్స్ అలాగే డిఫెన్స్ ఎవల్యూషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ, డిఫెన్స్ ప్రొక్యుర్‌మెంట్ ఏజెన్సీ, రెగ్యులేటరీ అథారిటీలైన సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఎయిర్‌లైన్ ఆపరేటర్స్, టెక్నికల్ సర్వీసును అందించే స్మాల్ అండ్ మీడియం ఎంప్లాయర్స్ దగ్గర, ఏరో స్పేస్ పరిశ్రమకు అవసరమైన స్పెషలిస్ట్ ఉత్పత్తులను అందించేవారి వద్ద ఉపాధి లభిస్తుంది.
ప్రైవేటు ఎయిర్‌లైనర్ల వద్ద కూడా అవకాశాలు ఉంటాయి.
ఉంటాయి. ఏరోస్పేస్ అంటే విస్తృతంగా ఉంటుంది. ఏరోనాటిక్స్, అస్ట్రోనాటిక్స్ సైతం కలగలసి ఉంటాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పరిధి పరిమితంగా ఉంటుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో భాగంగా సంబంధిత మెటీరియల్స్, ఇంజన్లు, బాడీ షేపు, స్ట్రక్చర్స్ పరిశోధన కూడా మిళితమై ఉంటుంది. స్ట్రక్చరల్ డిజైన్, నేవిగేషనల్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కమ్యునికేషన్, ప్రొడక్షన్ వంటి విభాగాల్లో స్పెషలైజేషన్ చేయవచ్చు.
యూరప్, అమెరికాతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ భారత దేశంలోనూ ఏరోస్పేస్ పరిశ్రమ పురోగతి వేగం అందుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఇస్రో, డి ఆర్ డి ఓ, హెచ్ ఎ ఎల్, ఎన్ ఎల్ వంటి సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయి.
గ్లోబల్ ఎయిర్‌లైన్ ఆపరేటర్స్ అలాగే ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలు రంగంలోకి వస్తుండటం విశేషం. అదే విదేశాల్లో పనిచేయానుకుంటే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలోని నాసాలో ఎక్కువ శాతం మంది భారతీయ ఇంజనీర్లు ఉన్నారు. బోయింగ్ మోకడోనెల్ డగ్లస్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కు సంబంధించి ఈ రెండూ చాలు.