రోడ్లు, ప్రాజెక్టులు, భవంతుల నిర్మాణంలో సివిల్ ఇంజనీరింగ్ కీలకం. ఇది చాలా పురాతన డిసిప్లిన్. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి వస్తున్న గ్రాడ్యుయేట్లకు కనీసం మూడు ఆఫర్లు ఉంటున్నాయని చెబుతున్నారు.
కోర్సులో భాగంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ (అనాలసిస్ డిజైన్) ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ (నీటి సరఫరా, పారుశుద్ధ్యం, కాలుష్యం), బయో టెక్నికల్ ఇంజనీరింగ్ (సాయిల్ మెకానిక్స్, ఫౌండేషన్ ఇంజనీరింగ్) ఇరిగేషన్ ఇంజనీరింగ్ (వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ భూగర్భ ఉపరితల జలవనరులు) హైడ్రాలిక్ ఇంజనీరింగ్/ఫ్లూయిడ్ మెకానిక్స్ (సర్క్యూట్స్, ఒత్తిడి, పంపింగ్ స్టేషన్లు), ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ (ట్రాఫిక్ ప్లానింగ్, ఫ్లయ్ ఓవర్లు, రహదారుల డిజైన్, హైవే సంబంధిత మెకనైజేషన్) తదితర అంశాలను చదవాల్సి ఉంటుంది. .
స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్, స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితరాల్లో పీజి చేయవచ్చు. .
ప్రతి పదిహేను మంది విద్యార్థులకు ఒక టీచర్ అన్నది ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన నిబంధన. ఇది ఏ డిసిప్లిన్ కైనా వర్తిస్తుంది. నాలుగేళ్ల కోర్సులను నడిపే సంస్ధలో కనీసం ఇద్దరు ప్రొఫెసర్లు, అయిదుగురు అసోసియేట్, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ ఉన్న కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. జియో టెక్నిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, కాంక్రీట్ టెక్నాలజీ, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు లేబ్‌లో ఉండాలి. సర్వేలేబ్‌లో టోటల్ స్టేషన్ ఉండాలి. ఇంకా వివరంగా చెప్పాంటే అంతకు మందు చదివిన విద్యార్థుల చేసిన నమూనాలు అక్కడ కనిపించాలి. .
వివిధ జలవనరుల ప్రాజెక్టులు, రహదారులు, భవంతుల నిర్మాణం, ఊపందుకున్న దరిమిలా సివిల్ ఇంజనీర్లకు ఉపాధికి సంబంధించి సమస్యే లేదు. టాటా కన్ సెల్టన్నీ సర్వీస్, టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్, ఎల్ అండ్ టి, రామ్‌కీ తదితర సంస్థలు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకు వచ్చి విద్యార్థులను నేరుగా తీసుకుంటాన్నాయి. నైపుణ్యం పెరిగితే కన్సల్టెంట్‌గా రాణించవచ్చు. .
ముఖ్యంగా ఇంజనీరింగ్ అధ్యయనం చేసే అభ్యర్థులు ఏమిటి బదులు ఇది ఎందుకు అని ప్రశ్నించడం నేర్పుకోవాలి. అందుకు తగ్గ సమాధానం రాట్టుకునే విద్యార్థులకు తిరుగే ఉండదు. ఒక దగ్గర ఉపయోగించిన సాంకేతికత మరొక దగ్గర ఎందుకు పనిచేయదు అన్నది తెలుసుకోవాలి. సివిల్ ఇంజనీర్లు చేపట్టే ప్రతి పని అందరి కంటిలో పడుతుంది దాంట్లో ఏదైనా లోపం తలెత్తితే ప్రజల నుంచి విమర్శలు తప్పవు. అదే సమయంలో ఒక ఇంజనీర్‌తో ప్రయోజనం పొందిన ప్రజలు ఆ వ్యక్తిని కలకాలం గుర్తుంచుకుంటారు. కాటన్ మహాశయుడు అందుకు పెద్ద ఉదాహరణం. ఆయన సమాధి కూడా మనకు పవిత్రమే