header

Energy Engineering


Energy Engineering
ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెంట్టింపు చేయాలన్నది సంబంధిత మంత్రిత్వశాఖ యోచన. రాబోయే సంవత్సరాల్లో కనీసం అయిదు లక్షల కోట్లు ఈ రంగంలో పెట్టుబడిగా అవసరమవుతుందని భావిస్తున్నారు. ఎనర్జీ ఇంజనీరింగ్‌ చేసిన వ్యక్తికి ఈ రంగంలోని ప్రాథమిక అంశాలపై పట్టు లభిస్తుంది. ఒక రకంగా ఇది ఇంటర్‌ డిసిప్లినరీ ప్రోగ్రామ్‌. సివిల్‌, మెకానికల్‌, మైనింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన అభ్యర్థుందర్ని ఇందులో కలపవచ్చు. ఎనర్జీ ఇంజనీరింగ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును ఆఫర్‌ చేసే సంస్థు తక్కువేనని చెప్పాలి.
ఇంధన వనరుల మెరుగుదల, సంప్రదాయేతర ఇంధన వనరులు తదితరాన్నీ ఎం టెక్‌లో ఉంటాయి. ఒక రకంగా ఇది పరివర్తన చెందుతున్న రంగం. ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు రంగాలు సైతం ఇందులోకి పెద్ద ఎత్తున వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇంధన ఉత్పత్తి, పంపిణి, పరిరక్షణ తదితరాలన్నీ ఇందులోకి వస్తాయి. ఇంధన వనరులు క్షీణిస్తుండటంతో ప్రత్యామ్నాయాలపై దృస్టి సారించక తప్పడంలేదు.
పునరుత్పాదక, సంప్రదాయ, సంప్రదాయేతర వనరులన్నింటినీ ఉపయోగంలోకి తెస్తున్నారు. వాటిని అభివృద్ధిపరచడం, అందుకు అవసరమైన ప్రక్రియను అందుబాటులోనికి తేవడం, సంబంధిత పరికరాలను రూపొందిచడం ప్రస్తుతం తక్షణ అవసరం దీంతో ఈ రంగంలోని ఇంజనీర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది.
ఇంధన ప్రాసెసింగ్‌ వినియోగ్నంలో పలు మార్పులు చోటుచేసుకుంటాన్నాయి. అంతరిక్షంతో మొదలుకుని సాదా వాడకం వరకు పలు అవసరాల కోసం ఇంధనం కావాల్సి వస్తోంది. అలాగే సహజవాయు నిక్షేపాలను వెలికితీయడం ఊపందుకున్నది. ఈ నేపధ్యంలో వీటిలో ఏ రంగాన్ని ఎంచుకున్నా మున్ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. భారీ అవకాశాలు ఉంటాయి. అర్థికంగా వెసులుబాటు అలాగే ప్రస్తుత ఇంధన టెక్నాలజీని గరిష్ఠ వినియోగం, బదిలీ, ఇంధన ప్లానింగ్‌, మేనేజ్‌మెంట్‌ సంబంధిత ఉద్యోగాలు భిస్తాయి.