ఇంజనీరింగు కోర్సులు చదవాటానికి - ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఒకే ఒక మార్గం - ఎం.సెట్ మరియు జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశపరీక్షల ద్వారా చదవవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఫిబ్రవరి లేదా మార్చిలో జరుగుతుంది. ఇందులో అర్హత సాధిస్తే ర్యాంకులను బట్టి ప్రభుత్వ లేదా ఇతర కళాశాలలో సీట్లు సంపాదించవచ్చు.
అర్హతలు : ఇంటర్‌లో మ్యాధ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
కోర్సులు : ఇంజనీరింగు బి.ఇ / బి.టెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగు) బి.టెక్ (డెయిరీ టెక్నాలజి) బి.టెక్ (ఎఫ్.ఎస్.ి) బి.ఎస్.సి (సిఎ. అండ్ బి.ఎం) బి.ఫార్మా కోర్సుల్లో చేరవచ్చు.
ఐఐటి- జె.ఇ.ఇ. : దేశంలో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్న సంస్థల్లో ఐఐటిలు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి) ప్రముఖమైనవి. దేశవ్యాప్తంగా 16 ఐఐటీలు ఉన్నవి.
ఐఐటి కోర్సులు : బి.ఇ. బి.టెక్, బి.ఆర్క్, బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కోర్సులున్నవి.
సీట్లు - 5500
ప్రవేశ పద్ధతి : జె.ఇ.ఇ. – జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌లో ఆర్హత సాధించాలి. - ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సబ్జెక్టులలో కనీసం 60 శాతం మార్కులుండాలి.
పరీక్షా విధానం : ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంాయి. రెండు ప్రశ్నాపత్రాలుంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుండి ప్రశ్నలు ఇస్తారు. తప్పు సమాధానికి నెగిటివ్ మార్కులుంటాయి.
కాలవ్యవధి : 3 గంటలు జె.ఇ.ఇ. కేవలం రెండుసార్లు మాత్రమే రాయవచ్చు.
ఏఐఈఈఈ : ట్రిపుల్ ఐటీలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యసంస్థల్లో చేరేందుకు జాతీయ స్థాయిలో జరిగే ఏ.ఐ.ఈ.ఈ.ఈ. ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సి.బి.ఎస్.ఇ.ఇంటర్మీడియ్ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో భోదించే ఉమ్మడి అంశాలనుండి ప్రశ్నలుంటాయి.
వేగం, కచ్ఛితత్వం రెండింకి ప్రాధాన్య ఇస్తారు. మొత్తం సీట్లు : 12000.
కోర్సులు :
బి.టెక్, బి.ఆర్క్ అర్హతలు : ఇంటర్ సైన్స్ సబ్టెక్లతో పాసై ఉండాలి. 25 సం.లు దాటకూడదు.
పరీక్షా విధానం : రెండు పేపర్లు ఉంటాయి. పెపర్ 1 బి.ఇ. బి.టెక్ కోర్సులకు: దీనిలో ఫిజిక్స్ మ్యాథ్స్, కెమిస్ట్రీలకు సంబంధించి ప్రశ్నలుంటాయి.
పేపర్ 2 బి. ఆర్కిటెక్చర్, బి. ప్లానింగుకోర్సులకు. మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్, డ్రాయింగులపై ప్రశ్నలుంటాయి.
బిట్ సాట్ : బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దేశంలోనే ప్రతిష్టాతత్మకమైన ఇన్‌స్టిట్యూట్ .
కోర్సులు : బి.ఇ. - ఆనర్స్, బి.ఫారమ్ - ఆనర్స్
అర్హతలు :ఇంటర్ సైన్స్ సబ్జెక్టులతో 80 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇది పూర్తి ఆన్‌లైన్ పరీక్ష. డిశెంబర్ లేదా జనవరిలో జరుగుతుంది. పరీక్షలలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
పూర్తి వివరాలకు www.bits-pilani.ac.in చూడండి.
ఇంజనీరింగుకు ఇంకా అనేక మార్గాలు : ట్రిపుల్ ఐ.టి లు , వీటిలో ప్రవేశానికి పదోతరగతి సరిపోతుంది. నవంబర్, డిశెంబర్‌లలో ప్రకటన వెలువడుతుంది. వీటిలో చేరడానికి కూడా ఎ.ఐ.ఈ.ఈ.ఈ. రాయాల్సిందే.
ఏ.పి ట్రిపుల్ ఐ.టొ కేంద్రాల్లో అడ్మిషన్లకు రాజీవ్ గాంథీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం వారిని సంప్రదించవచ్చు. బాసరలో 1,000 సీట్లు, నూజివీడులో 1,000 సీట్లు, ఇడుపులపాయలో 1,000 సీట్లు కలవు. సర్కారు స్కూళ్ళలో చదివే విద్యార్థులకు 4 శాతం మార్కులు బోనస్. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.
www. aponline.gov.in.rgukt.in
తిరువనంతపూరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ వారు 2010 నుండి తమ సంస్థలలో ప్రవేశాని ఐశాట్ ను నిర్వహిస్తుంది. రెండు పేపర్లు జె.ఇ.ఇ. తరహాలో ఉంటాయి. ప్రత్యామ్యాయ ఇంజనీరింగు కోర్సుల వివరాలకు : www.ieindia.org చూడండి.