header

Industrial Engineering …ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌


Industrial Engineering …ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌
ఇండస్ట్రీయల్‌ ఇంజనీరింగ్‌ను వివిధవ్యవస్థల సమన్యయంగా పేర్కొనవచ్చు. ఇంజనీరింగ్‌కు సంబంధించి అభివృద్ధి, మెరుగుదల, కార్యాచరణ, మూల్యాంకనం అదే మాదిరిగా ఉద్యోగులు, కేపిటల్‌, పరిజ్ఞానం, పరికరాలు, ఎనర్జీ, మెటీరియల్‌ ప్రాసెస్‌ సమన్యయంగా ఈ సబ్జెక్టును అర్థం చేసుకోవచ్చు.
ఇంజనీరింగ్‌ అనాలిసిస్‌, సింధసిస్‌ అలాగే మేథమెటికల్‌, ఫిజికల్‌, సోషల్‌ సైన్సెస్‌ మెధడ్స్‌, ప్రిన్సిపుల్స్‌ను డిజైన్‌, ప్రత్యేకీకరణ, ఊహించడం, మూల్యాంకన జరుపుతారు. సక్రమంగా లేని మాన్యుఫాక్చరింగ్‌ వ్యవస్థలో సమయం, కేపిటల్‌, మెటీరియల్స్‌, ఎనర్జీ, ఇతర వనరుల పరంగా జరుగుతున్న వృధాను అరికడతారు. ఇతరత్రా అన్నింటినీ కలుపుకొని ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, మేనేజ్‌మెంట్‌ సైన్స్‌, ఆపరేషన్స్‌ రీసెర్చ్‌, సిస్టమ్‌ ఇంజనీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎర్గోనమిక్స్‌, హ్యూమన్‌ ఫాక్టర్స్‌, ఇంజనీరింగ్‌, సేఫ్టీ ఇంజనీరింగ్‌ గానూ వినియోగించే తీరు, ఉపయోగాలను బట్టి పేర్కొనవచ్చు.అత్యంత ఎక్కువగా ఉత్పత్తి సాధించడమే లక్ష్యం.
డిజైన్‌, సమర్థ వ్యూహం, ఆపరేటివ్‌ సిస్టమ్‌ను సమన్యయపర్చడం ద్వారా అత్యధిక ఉత్పత్తిని సాధించేందుకు ఇండస్ట్రియల్‌ ఇంజనీర్లు కృషి చేస్తారు. అందువల్ల ఉత్పత్తికి అవసరమైన మెటీరియల్‌, ఉద్యోగులు, పరికరాలు, ప్రాసెస్ ను సమన్యయపరిచేలా డిజైన్‌, ఇనస్టలేషన్‌ పని. ఇందులో ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఉత్పత్తిని గరిష్టంగా పొందటం, అత్యున్నత స్థాయిలో నాణ్యత సాధించడం, అంతిమంగా అవన్నీ ఆర్థికంగా వెసులుబాటు కల్పించేవి కావడం లక్ష్యంగా ఉంటాయి. అందువల్ల ఇండస్ట్రీయల్‌ ఇంజనీరింగ్‌ కంట్రోలింగ్‌ను ఒక ఆర్గనైజేషన్‌లో పర్యవేక్షిస్తారు.
డిజైనింగ్‌కు తోడు ప్రొడక్షన్‌ ప్రాసెస్‌ను సైతం పర్యవేక్షిస్తారు. ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు పరంగానే విస్తృతమైనది. అందువల్ల అన్ని రకాల మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలో కొలువు పొందవచ్చు. టాటా పరిధిలోని అని రంగాలు అంటే మోటార్స్‌, స్టీల్స్‌, కమ్యూనికేషన్‌ తదితరాలు అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, మారుతీ ఉద్యోగ్‌తోపాటు టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ప్రభుత్వరంగ సంస్థలు, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఒ యన్‌ జిసి, ఇస్రో,డి ఆర్‌ డి ఒ తదితరాల్లో ఇండస్ట్రియల్‌ ఇంజనీర్లకు ఉపాధి అవకాశాలు ఉంటాయి.