భూమిలో మూడువంతులు నీరే ఉండటంవన సవాళ్ళు స్వీకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తులను మెరైన్ ఇంజనీరింగ్ ఆకట్టుకుంటుంది. సముద్రంలో ముఖ్యంగా సంబంధిత పరికరాలతో పనిచేయాలనే ఉత్సాహం ఉంటే చాలు, అవకాశాలకు కొదువలేదు. నీటిపై సాధారణ ప్రయాణం ఇప్పటికీ తక్కువే అయినప్పటికీ, ఎనభై శాతం వస్తు రవాణా మాత్రం ఈ మార్గం మీదుగానే సాగుతోందన్నది సత్యం. అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు ప్రధానంగా నౌకలు, ఇతర వాటర్ వెసల్స్ ద్వారానే సాగుతోంది. ఆయా నౌకలు, నేవిగేషన్‌కు సంబంధించి వృత్తిపరంగా ఎదిగేందుకు మెరైన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ప్రాథమిక కోర్సు.
నాటికల్ ఆర్కిటెక్చర్, సైన్స్ సబ్బెక్టుతో కలగలిసే మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు అవుతుంది. సముద్రాలు, తీర ప్రాంతాలు లేదా ఇన్‌లాండ్ వాటర్‌వేస్ సంబంధ అద్యయనం అలాగే పరిశోధనలను మెరైన్ ఇంజనీరింగ్‌గా పేర్కొనవచ్చు. నౌకలు లేదా చిన్నపాటి పడవ నిర్మాణం, నిర్వహణ తదితరాలు మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులో భాగాలు. కొద్దిపాటి అయోమయానికి గురిచేసినప్పటికీ నేవల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్, ఓషన్ ఇంజనీరింగ్ వంటివన్నీ ఒకేరకమైన అర్థాన్ని కలుగజేస్తాయి. షిప్ డిజైన్, వివిధ మెయిన్ బాడీ విభాగాలు, మిగిలిన అన్ని అరేంజ్‌మెంట్స్, పవర్ అవసరాలు, నిర్మాణం, స్థిరత్వం (స్టెబిలిటి) వంటివి నేవల్ ఆర్కిటెక్ట్‌లు చూస్తారు. ఓషన్ ఎన్విరాన్‌మెంట్, అది నౌకపై చూపే ప్రభావం, మెరైన్ వెహికల్స్‌వాటి స్ట్రక్ఛర్ల పనిని ఓషన్ ఇంజనీర్లు స్టడీ చేస్తారు.
స్టేషనరీ ఓషన్ ప్లాట్‌ఫామ్స్, సముద్రం లోపల అన్వేషణకు ఉపయోగించే నౌకను మానవ ప్రమేయం లేకుండా నిర్వహణ తదితరాలు ఓషన్ ఇంజనీర్ల పరిధిలోకి వస్తాయి. నౌక సాంకేతిక నిర్వహణకు సంబంధించి పూర్తి నిర్వహణ బాధ్యతలు మెరైన్ ఇంజనీర్ల భుజస్కంధాలపై ఉంటాయి. ఒక నౌకకు అవసరమైన యంత్రసామాగ్రిని ఎంపిక చేసే బాధ్యత మెరైన్ ఇంజనీర్‌దే. డీజిల్ ఇంజన్లు, స్టీమ్ టర్బయిన్లు, గ్సాస్ టర్మయిన్లు, అదేవిధంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఫ్లూయిడ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్‌ని పర్వవేక్షిస్తారు. నౌక నిర్వహణ సిబ్బందిలో వీరు చాలా ప్రధానమైన వ్యక్తులు. మెరైన్ టెక్నీషియన్లు, క్రాఫ్ట్స్ సిబ్బంది కగలిసిన సిబ్బందికి నాయకత్వం వహించాల్సి ఉంది. నౌక ఇంజన్ రూమ్ నిర్మాణం, వివిధ కార్యకలాపాలు, నిర్వహణ మెరైన్ ఇంజనీర్ల ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాంటే, నౌకకు సంబంధించిన సాంకేతిక వ్యవహారన్నింటినీ మెరైన్ ఇంజనీర్ నిర్వహించాల్సి ఉంటుంది.
ఇంజన్ అందులో పనిచేసే సిబ్బందిపై అజమాయిషి చేయాలి. తద్వారా మెరైన్ బాడీ ప్రమాణాలు, భద్రతకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆదునీకరణ, సంబంధిత అభివృద్ధి, ఎలక్ట్రానిక్ నేవిగేషన్‌తో ఇప్పటి మెరైన్ ఇంజనీర్ పాత్ర చాలా సాఫ్ట్‌గా మారిందన్న విషయాన్ని గమనించాలి.
మెరైన్ ఇంజనీరింగ్‌లో కనీసం నాలుగేళ్ళ బి ఇ / బి టెక్ చేసిన వ్యక్తులు ఈ పనులు నిర్వహించవచ్చు. వాస్తవానికి ఇదే బేసిక్ క్యాలిఫికేషన్. వృత్తిపరంగా ఎదిగేందుకు అవకాశం ఉంది. నౌకలోనే కాకుండా సముద్రతీరంలోనే పలు ఉద్యోగాలు ఈ కోర్సు చేసినవారికి ఉంటాయి. పెద్ద మొత్తంలో జీతానికి తోడు ఎన్ ఆర్ ఐ హోదాను కూడా ఈ ఉద్యోగాలతో పొందవచ్చు. వందశాతం ప్లేస్‌మెంట్‌కు అవకాశం ఉన్న కోర్సు ఇది. అంతర్జాతీయంగా నౌకా రవాణా ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలు పెరగటంతో ఉపాధికి ఢోకా లేని కోర్సుగా మెరైన్ ఇంజనీరింగ్ మారింది
పలు దేశీయ, విదేశీ ఇంజనీరింగ్ సంస్థలు మెరైన్ ఇంజనీరింగ్‌లో కోర్సులను అందిస్తున్నాయి. మెరైన్ ఇంజనీరింగ్‌గా వృత్తి చేపట్టాంటే కనీసం బి ఇ మెరైన్ ఇంజనీరింగ్ / నాటికల్ సైన్స్, పీజి డిప్లోమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అవసరం. నౌకల డిజైన్, నిర్మాణంలో మెరైన్ ఇంజనీర్లు ప్రధానంగా సంబంధిత డిజైన్, పరిశోధన, విద్య, శిక్షణ, కన్సల్టెన్సీ విభాగాల్లో ఉపాధి పొందుతారు. ఇంజనీరింగ్ విభాగాల్లో ఎక్కువ వేతనం పొందే వారిలో మెరైన్ ఇంజనీర్లు ఒకరు. ఆరంభంలో మంచి ప్యాకేజీ వీరికి ఉంటుంది.ఇండియన్ మర్చెంట్ నేవీ అయితే ప్రయాణీకుల నౌకలు. కార్గో లైనర్లు, ట్యాంకర్లు, వివిధ ఖనిజాలను ఎగుమతి చేసే నౌకలు, ఇతర ప్రత్యేక తరహానౌకల్లో వీరు పనిచేస్తారు. పబ్లిక్ ప్రైవేట్ రంగాల్లో ఈ కంపెనీలు ఉంటాయి.
చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ నౌకల్లో ప్రధాన పోస్టు. ఈ వ్యక్తి కింద పలువురు జూనియర్ ఇంజనీరింగ్ అధికారులు తమ విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. మెరైన్ ఇంజనీర్‌గా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలంటే కొన్ని లక్షణాలు తప్పనిసరి
- నిర్వహణా సామర్థ్యం
- ఆచరణాత్మకత
- వివిధస్థాయిల్లో ఉన్న అధికార, అనధికార సిబ్బందితో కలగలిసి పోగల సామర్థ్యం.
- వివిధ తరహా నౌకల నిర్మాణంపై కాన్సెప్ట్ పరంగా మంచి పరిజ్ఞానం.
-సంక్షోభం, ఒత్తిడి సమయాల్లో సైతం చక్కగా పనిచేయగల సామర్థ్యం.
- పనిలో ఆనందం పొందే తత్వం
- మంచి కమ్యునికేషన్ నైపుణ్యాలు
- శారీరక సామర్థ్యం
- సముద్రయానంపై ఆసక్తి
ఇండియన్ మర్చంట్ నేవీలో మెరైన్ ఇంజనీర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. అంతర్జాతీయంగా సముద్ర రవాణా పెరగటం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున నౌక నిర్వహణ కంపెనీలు ఆరంభం కావటంతో వీరికి డిమాండ్ పెరిగించి. వేతన ప్యాకేజీలు సైతం చాలా బాగుంటాయి.